జాతిని తాకట్టు..అమ్మకం పెట్టలేదు

కాపు నాయకుడు, తూర్పు గోదావరి ప్రజా నాయకుడు ముద్రగడ పద్మనాభం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసారు. తుని లో జరిగిన రైలు దహనం కేసుకు సంబంధించిన నేపథ్యంలో ముద్రగడ ఈ ప్రకటన విడుదల…

కాపు నాయకుడు, తూర్పు గోదావరి ప్రజా నాయకుడు ముద్రగడ పద్మనాభం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసారు. తుని లో జరిగిన రైలు దహనం కేసుకు సంబంధించిన నేపథ్యంలో ముద్రగడ ఈ ప్రకటన విడుదల చేసారు. 

తన వ్యక్తిగత పూర్వా పరాలు, ఈ కేసు పూర్వా పరాలను ముద్రగడ ఆ ప్రకటనలో వివరించారు.2016 ఫిబ్రవరిలో తనను అరెస్ట్ చేసి, ఏకంగా తీహార్ జైలుకు తరలించడానికి ప్రయత్నాలు చేసారని ఆ లేఖలో వివరించారు.

తన రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని ముద్రగడ వెల్లడించారు. జాతిని అమ్మకం పెట్టడం కానీ, తాకట్టు పెట్టడం కానీ ఏ రోజు చేయలేదని ముద్రగడ తన లేఖలో స్పష్టం చేసారు. ఏనాడూ తాను ప్రలోభాలకు లొంగలేదని తెలిపారు. కాపు రిజర్వేషన్లు జోకరు కార్డు మాదిరిగా మారాయని ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రజల్లో మార్పు రావాలని, డబ్బు తీసుకోకుండా ఓటు వేసే రోజులు వస్తే, కేవలం లక్షల ఖర్చుతో ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వుంటుందని, ఆ దిశగా అందరూ ఆలోచించాలని ముద్రగడ పేర్కొన్నారు. 

తుని కేసుకు సంబంధించి ఏ ఒక్క వాయిదా కూడా మిస్ కాలేదని, కోర్టుల మీద వున్న గౌరవంతో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా వాయిదాలకు హాజరవుతూ వచ్చానని, తన కేసును తన మీద అభిమానంతో పలువురు లాయర్లు ఉచితంగా వాదించారని ముద్రగడ వెల్లడించారు.