జేసీ వింత ప్రవర్తన.. చొక్కా విప్పేసి హ‌ల్ చ‌ల్!

రోజురోజుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వింతగా ప్రవర్తిస్తున్నారు. తానేమో రాజకీయ పోరాటాలు చేస్తానంటూనే తన ఓవరాక్షన్ తో నవ్వుల పాలు అవుతున్నారు. తాజాగా ఏడు పదుల వయసులో బట్టలు విప్పుకుంటూ…

రోజురోజుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వింతగా ప్రవర్తిస్తున్నారు. తానేమో రాజకీయ పోరాటాలు చేస్తానంటూనే తన ఓవరాక్షన్ తో నవ్వుల పాలు అవుతున్నారు. తాజాగా ఏడు పదుల వయసులో బట్టలు విప్పుకుంటూ తెగ వింత‌గా ప్ర‌వ‌ర్తించారు. 

తాజాగా తాడిప‌త్రి ప‌ట్ట‌ణంలో ఫ్టెక్సీల రాజ‌కీయం సాగుతోంది. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ ఇరువురు నాయ‌కులు ఫ్టెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. డీజిల్ దొంగ ఎవ‌రంటూ జేసీకి వ్య‌తిరేకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ‌ర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ద‌గ్గ‌ర‌కు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వెళ్లి ఆ ఫ్లెక్సీలో ఉన్న పెద్దారెడ్డి ఫొటో చూపుతూ ఇద్ద‌రం దొంగ‌ల‌మేన‌ని..  ప్రజల సొమ్ము దోచుకున్న పెద్దారెడ్డి అంటూ ఫ్లెక్సీకి ప్రభాకర్ రెడ్డి ముద్దులు పెట్టారు. అనంత‌రం ప్రజల మనసు దొచుకున్న గజదొంగ తానే అంటూ ప్రభాకర్ రెడ్డి చొక్కా విప్పి తన గుండెను చూపించారు.

గ‌త కొన్ని రోజుల నుండి అధికారులు త‌న మాట విన‌లేద‌ని ర‌క‌ర‌కల విన్యాసాలు చేసిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా చొక్కాలు విప్ప‌కుంటూ వింత‌గా మాట్లాడుతున్నారు. ఇద్ద‌రం దొంగలేమ‌ని.. ఎమ్మెల్యే ప్ర‌జ‌ల సొమ్మును దొచుకున్న గ‌జ‌దొంగ అని.. తాను మాత్రం తాడిప‌త్రి ప్ర‌జ‌ల మ‌న‌సును దోచుకున్న దొంగ‌నంటూ.. త‌న గుండె ఎప్పుడూ తాడిప‌త్రి.. తాడిప‌త్రి అనే కొట్టుకుంటుంద‌ని పెద్ద హ‌డ‌వుడి చేశారు.

తాడిప‌త్రి ప్ర‌జ‌ల మ‌న‌సు దొచుకున్న వారు అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఎందుకు ఓడిపోయారంటూ వైసీపీ నేత‌లు సెటైర్లు వేస్తున్నారు. కాగా ఎన్నిక‌లకు ద‌గ్గ‌ర ప‌డే కొద్ది త‌న కొడుకు రాజ‌కీయ భ‌విష్య‌త్తు దృష్టిలో పెట్టుకొని ర‌క‌ర‌క‌లుగా విన్యాసాలు చేస్తున్నారు.