వరసబెట్టి సినిమాలు మధ్యలో విరామాలు వెళ్తే ఢిల్లీ పెద్దలతో భేటీలు లేకపోతే చంద్రబాబుతో కీలక మీటింగులు ఇదీ జనసేన పవన్ కళ్యాణ్ రాజకీయంగా మారిపోయింది. ఏడాది వ్యవధికి ఎన్నికలు వచ్చినా వారాహి బండిని రోడ్డెక్కించని పవన్ వైఖరి మీద జనసైనికులు కూడా ఒకింత విసుగు చెందుతున్నారని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో మెరుపు లాంటి వార్త ఒకటి బ్రేకింగ్ న్యూస్ లా టీవీ తెరపై కనిపించింది.
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ గంట పాటు చర్చలు అంటూ వచ్చిన ఆ వార్తలోని సారాంశం ఏమిటన్నది రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి అర్ధమయ్యే విషయమే. దీని మీద మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ జనసేనలోని నంబర్ టూ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఇలాంటి భేటీలు మరిన్ని ఫ్యూచర్ లో జరుగుతాయని ఆయన చెప్పారు.
వైసీపీ లేని ఏపీని చూడాలన్న పవన్ లక్ష్యంలో భాగంగానే ఈ భేటీలు అని నాదెండ్ల చెబుతున్నారు. పొత్తుల కంటే ప్రజా సమస్యల మీదనే ఇరువురు నేతలు చర్చించారు అని నాదెండ్ల అంటున్నారు అయితే ఈ భేటీ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్లు ట్రోలింగ్ తో పొలిటికల్ విమర్శలు తారస్థాయికి చేరిపోయాయి.
పొత్తుల కోసమే ఈ భేటీ అని కూడా సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ స్పష్టం చేశారు. ఏపీ మహిళా కమిషన్ మెంబర్ గెడ్డం ఉమ పవన్ బాబు భేటీ మీద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
పొత్తులో కోసం ఒక బాబు వెంపర్లాడుతున్నాడు. స్నేహాల పేరిట మరికొందరు ఉన్నారు. ఇలా ఒకే ఒక్కడు తప్ప అందరూ ఫుల్ బిజీగా పొత్తుల వెంపర్లాటలో ఉన్నారు అంటూ పవన్ మీద పంచులేశారు. ఆ ఒకే ఒక్కడు మాత్రం జగన్ అని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పారు. ఆ ఒకే ఒక్కడికి ఈ స్నేహాలు పొత్తుల వెంపర్లాటలు లేవు.
ఎందుకంటే ఆయనకు జనాలతో పొత్తు ఎపుడో కుదిరింది కాబట్టి అని గెడ్డం ఉమ పేల్చిన పంచ్ పవన్ ఫ్యాన్స్ కి మామూలుగా తగలడంలేదు అంటున్నారు. అలా పవన్ని పొత్తుల వేటలో బిజీగా ఉన్నారని ఆమె ఘాటుగానే విమర్శించారు.