కొడాలి నాని పాత్ర‌ను పోషిస్తున్న టీడీపీ నేత‌

ఒరేయ్‌, నా కొడకా, ఇంటికాడికి వ‌చ్చే తంతే నీకు దిక్కెవ‌రా? లాంటి మాట‌లు అల‌వోక‌గా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నోటి నుంచి వ‌చ్చాయి.

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రిగా, ఆ త‌ర్వాత మాజీ మంత్రిగా కొడాలి నాని త‌మ ప్ర‌త్య‌ర్థులైన చంద్ర‌బాబునాయుడు, లోకేశ్‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డేవారు. ఏ మాత్రం గౌర‌వం లేకుండా వాళ్ల‌పై నోరు పారేసుకునేవారు. వైసీపీపై అస‌హ్యం ఏర్ప‌డ‌డానికి కొడాలి నాని త‌న వంతు పాత్ర‌ను పోషించారు. వైసీపీ అంటే స‌భ్య‌త‌, సంస్కారం లేని పార్టీగా విద్యావంతులు, మేధావులు, త‌ట‌స్థుల్లో నెగెటివ్ ముద్ర వేయ‌డానికి కొడాలితో పాటు మ‌రికొంద‌రు నాయ‌కులు విజ‌య‌వంతంగా ప‌ని చేశారు.

ఇప్పుడు కూట‌మి అధికారంలో వుంది. వైసీపీ నాయ‌కుల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు. ఈ పోటీలో తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఆదివారం మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ వాడిన అభ్యంత‌ర‌క‌ర భాష గురించి చెప్పుకోవ‌చ్చు.

ఒరేయ్‌, నా కొడకా, ఇంటికాడికి వ‌చ్చే తంతే నీకు దిక్కెవ‌రా? లాంటి మాట‌లు అల‌వోక‌గా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నోటి నుంచి వ‌చ్చాయి. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఘ‌న కార్యం చేసిన‌ట్టు, ఆయ‌న కామెంట్స్‌ను టీడీపీ ఛానెల్స్ సంబ‌ర‌ప‌డుతూ ప్ర‌ధాన శీర్షిక‌లుగా పెట్ట‌డం గ‌మ‌నార్హం.

స‌హ‌జంగా అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్‌ను మీడియా క్యారీ చేయ‌దు. కానీ మారిన మీడియా ధోర‌ణి కార‌ణంగా, ప్ర‌త్య‌ర్థుల్ని తిట్టిన వాళ్ల‌ను గొప్పోళ్ల‌గా చిత్రీక‌రించ‌డం విశేషం. ఇదే రీతిలో కూట‌మి నాయ‌కులు వ్య‌వ‌హ‌రించినా, ఆ మీడియా అతి చేసినా, రాబోయే రోజుల్లో జ‌నం అస‌హ్యించుకోవ‌డం ఖాయం.

2 Replies to “కొడాలి నాని పాత్ర‌ను పోషిస్తున్న టీడీపీ నేత‌”

  1. అదికారం అడ్డుపెట్తుకొని JC ని ఎలా వెదించారొ అందరికీ తెలిసిందె! అయన మాటలలొని బాద అందరికీ అర్దం అయ్యెదె!

    జగన్ పాలనలొ దెబ్బ తిన్నా.. సిమ్హం లా గాండ్రించింది ఒకరు!

    మంత్రి పదవి కొసం బూ.-.తు.-.లతొ మొరిగి… ఒడగానె కనపడకుండా పొయిన గ్రామ సిమ్హం మరొకరు.!!

    Both are not S.. A.. M.. E..!!

  2. ఒరేయ్, నా కొడకా, ఇంటికి వచ్చి తంత ఇది కొడాలి నాని రేంజ్ బాషా….కనీసం జోగి రమేష్ రేంజ్ కూడా లేదు

Comments are closed.