విశాఖలో మంత్రుల మీద ఎయిర్ పోర్టులో జరిగిన దాడి మీద సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. మంత్రుల మీద దాడులు చేయడాన్ని అంతా ఖండించాలని ఆయన అన్నారు. ఈ విధంగా చేయకపోతే ఇలాంటివి మరిన్ని జరుగుతాయని కూడా అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేయాల్సిందే అని కూడా ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పుకోవచ్చునని అయితే దాడులు మంచి విధానం కాదని ఆయన అన్నారు. మంత్రుల మీద దాడులు చేయడం వెనక ఎవరు ఉన్నారు. ఎవరు నాయకత్వం వహించారు అన్న దాని మీద కూడా లోతైన విచారణ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యలో దాడులకు తావు లేదని ఆయన అన్నారు.
ఇక ఎయిర్ పోర్టులో సీసీ ఫుటేజ్ ఆధారంగా అసలు నిందితులు ఎవరో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంది అని ఆయన అన్నారు. ఇది యాధృచ్చికంగా జరిగిన దాడా లేక ప్లాన్ వేసుకుని చేశారా అన్న విషయాలు పోలీస్ విచారణలో బయటపడాలని జేడీ కోరారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించమన్న మెసేజ్ ప్రజలకు వెళ్లాలని ఆయన అన్నారు.
తప్పు ఎవరు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన అన్నారు. ఈ విషయంలో పోలీసులకు చట్టపరమైన అన్ని అధికారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జేడీ మాటల బట్టి చూస్తే దాడుల విషయంలో ఎవరున్నారో పోలీసుల విచారణలో బయటపడుతుందా లేదా అన్నది చూడాలి.