జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో చేసిన హడావుడిని పెద్ద డ్రామాగా అభివర్ణించారు మాజీ మంత్రి పేర్నినాని. కేవలం చంద్రబాబు ప్రయోజనల కోసమే పవన్ విశాఖ టూర్ లో హడవుడి చేశారంటూ మండిపడ్డారు. విశాఖ గర్జనను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు తరుపున పవన్ విశాఖ వెళ్లరాని విమర్శించారు. సినిమా షూటింగ్ లో విరామంలో చంద్రబాబు ఇచ్చిన ఫ్యాకేజీకి న్యాయం చేశారన్నారు.
పవన్ కు కావాల్సింది కేవలం చంద్రబాబు ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనలు పట్టవని, విలువలు, నిబద్ధత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా? లేక లేక ముఠా నాయకుడా? అంటూ మండిపడ్డాడు. విశాఖ నుండి కదలని అని చెప్పి మళ్లీ ఎందుకు వెళ్లిపోయరని విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం విశాఖకు వచ్చి వెళ్లిపోయారన్నారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలపై మాట్లాడినా వ్యాఖ్యలపై పేర్నినాని మాట్లాడుతూ.. మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటున్నావు అందరూ నీ లాగా చెడిపోవాలని కోరుకుంటున్నావా నీ వల్ల సమాజం చెడుపోతుందని, నీవు మూడు కాకపోతే మూపై పెళ్లిళ్లు చేసుకో ఎవరు వద్దన్నారు కాకపోతే నీలాంటి వారు సూక్తులు చెప్పడం తప్పన్నారు.
ఇప్పటికైనా నీతి, నిబద్ధతలతో రాజకీయాలు చేస్తే మంచిదన్నారు. పవన్ కళ్యాణ్ అజెండా ఎలాంటిదో జనసేన కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని, పవన్ కు కావాల్సింది చంద్రబాబు ప్రయోజనలు తప్పా మరేమి లేదని జనసేన కార్యకర్తలను ఇప్పటికైనా మారాలన్నారు.