జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి మంచి పని అంటే.. ప్రతి ప్రజాప్రతినిధి కూడా అనుసరించవలసిన మార్గం అంది. వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే.. ప్రభుత్వం సక్రమంగా ఉండాలంటే.. ప్రతి చట్టసభల ప్రతినిధీ, స్థానిక సంస్థల ప్రతినిధి, పదవులు లేని నాయకులు కూడా ఆ మార్గం తొక్కి చూడాలి. కానీ దురదృష్టం ఏమిటంటే.. ఎవ్వరూ ఆ దిశగా శ్రద్ధ చూపించరు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుుడు, సంబంధిత మంత్రి నారా లోకేష్ లాంటి వాళ్లు కూడా.. ఏదో కొన్ని కార్యక్రమాల్లో అలాంటి డైలాగులు వల్లించి, అక్కడితో మమ అనిపిస్తారే తప్ప.. చిత్తశుద్ధితో ఆ సంకల్పాన్ని భుజానికెత్తుకోరు. కానీ.. అందరూ అంతే శ్రద్ధగా పనిచేస్తే రాష్ట్రప్రభుత్వ ముఖచిత్రమే మారిపోతుంది.
ఇంతకూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏం చేశారు?
‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి.. చక్కగా చదువు చెప్పిస్తాం..’ అని ఆయన ఇంటింటికీ తిరిగి చెబుతున్నారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ బడులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇప్పుడున్న అధికారుల్లో ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత విద్యలు చదివిన అనేకమంది తమ బాల్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనని ఆయన గుర్తు చేస్తున్నారు. పాలకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉమ్మడిగా బాధ్యత తీసుకుని ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేద్దామని పిలుపు ఇస్తున్నారు.
జనవిజ్ఞాన వేదిక ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. కానీ నిజానికి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నాయకుడు కూడా ఈ సీజనులో ప్రభుత్వ బడుల గురించి ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూములు, మౌలిక వసతులు, సుశిక్షితులైన నాణ్యమైన టీచర్లు అందరూ ఉంటున్నారు. అయితే.. విద్యార్థుల సంఖ్యమాత్రం పలచగా ఉంటుంది.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలన్నీ సార్థకం కావాలంటే.. నేతలందరూ కూడా వీటి గురించి విస్తృతంగా ప్రచారాలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదో కాంట్రాక్టుల కోసం, ఆ రూపేణా డబ్బు దండుకోవడం కోసం పాఠశాలల్లో సదుపాయాలు కల్పించడం అనేది కాకుండా.. నిజంగానే ప్రభుత్వం పాఠశాలల్ని నాణ్యంగా తయారు చేయదలచుకుంటే గనుక.. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా ప్రతిఒక్కరూ ఇప్పటి నుంచి సుమారు ఆగస్టు నెల వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరూ చేరేలా స్పెషల్ ప్రచార డ్రైవ్ నిర్వహిస్తే బాగుంటుంది.
అలా చేసినట్లయితే, ప్రభుత్వాలు ప్రెవేటు పాఠశాలలకు కొమ్ముకాయకుండా, వారి మోచేతి నీళ్లు తాగడానికి ఆశపడకుండా పనిచేస్తున్నాయని నమ్మకం ప్రజలకు కూడా కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు మరింత పరిపుష్టిగా తయారవుతాయి.
Mee jaggadiki kuda Cheppu mari…Ila cheyamani
Athyadika development in schools aindi vadi time lo ne..
ఇలా అయితే చై.నా ఏమి కావాలి?
మనమెంత లేపిన మన పార్టీ కస్టమన్నా