తెలుగుదేశం పార్టీ అజెండాను జెండాను మోస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయరని ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ జోస్యం చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న వైనం జనసేనకు భారీగా రాజకీయ నష్టం కలిగిస్తుందని పాల్ అంటున్నారు.
పవన్ తప్పు చేశారని ఆయన చెబుతున్నారు. పవన్ తన పార్టీని సొంతంగా పోటీ చేయించకుండా పొత్తులు పేరిట చంద్రబాబుతో స్నేహం చేస్తే జనాలు ఓట్లు ఎందుకు వేస్తారని ఆయన ప్రశ్నించారు. పవన్ చంద్రబాబు వెంట ఉండి తప్పు చేస్తే టీడీపీకి చంద్రబాబుకు దూరంగా జరిగి జూనియర్ ఎన్టీఆర్ తెలివిగా వ్యవహరించారని పాల్ కితాబు ఇవ్వడం గమనార్హం.
చంద్రబాబు ఏపీలో ఏమి చేశారని పవన్ మద్దతు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. బాబుకు తొలి అవకాశం విభజన ఏపీలో ఇస్తే ఆయన హయాంలో రాజధాని నిర్మాణం కానీ ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ భారీగా అయినా తేలేక పోయారని అన్నారు.
చంద్రబాబుకు స్టేలు బెయిల్ తెచ్చుకోవడం ఎలాగో తెలియదా. ఆయనకు లిగాలిటీలో మంచి పట్టు ఉందని వైసీపీ లాంటి ప్రత్యర్ధి పార్టీలే అంగీకరిస్తాయి. అయితే చంద్రబాబుకు ఏమీ తెలియదన్నట్లుగా ప్రజా శాంతి ప్రెసిడెంట్ కేఏ పాల్ సలహాలు సూచనలు ఇస్తున్నారు. ప్రధాని తలచు కుంటే చంద్ర బాబు నాయుడు కి బెయిల్ వస్తుంది అని అంటున్నారు.
ఇవన్నీ చూసి కూడా పాల్ రాజకీయంగా జోకర్ అని ఎవరైనా అనుకుంటే ఆయన మీడియా సమావేశాలు ఆయనకు ఉన్న అవగాహన వంటివి చూస్తే మాత్రం తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సిందే అంటున్నారు. చాలా మంది రాజకీయ నేతల కంటే పాల్ తెలివైన వారు అనే అంతా ఒప్పుకోవాల్సి ఉంటుంది అంటున్నారు.