వరద సహాయం ఎలా చేయాలో నేర్పిస్తా!

వరద బాధితులకు ఏ విధంగానూ సాయం అందడలేదు అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. చంద్రబాబు ఒక్కరే తిరుగుతున్నారని అధికార యంత్రాంగం అయితే సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు. తాను…

వరద బాధితులకు ఏ విధంగానూ సాయం అందడలేదు అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. చంద్రబాబు ఒక్కరే తిరుగుతున్నారని అధికార యంత్రాంగం అయితే సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు. తాను విజయవాడ వరద బాధిత ప్రాంతాలను సందర్శించి వచ్చాను అని ఆయన చెప్పారు.

వరద సాయం చేయడం అన్నది ఒక విద్య అని ఆయన అంటూ అందులో తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు. వివిధ దేశాలలో ఎన్నో ప్రకృతి విపత్తులు వచ్చినపుడు తాను తమ బృందం అక్కడికి వెళ్ళి బాధితులకు అందరికీ పూర్తి సాయం అందించి ఉపశమనం కలిగించామని అన్నారు.

ఏపీలో వరద సహాయం ఎలా చేయాలో అధికారులకు తాను నేర్పిస్తాను అని పాల్ భారీ ఆఫర్ ఇచ్చారు. బాధితులు ఏమీ అందక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని ఆయన విమర్శలు చేశారు. లక్షలాది మంది వరదలో చిక్కుకుని ఉన్నారని ఆయన అన్నారు.

అరకొర సాయం వారికి ఏ మాత్రం సరిపోదని ఆయన అంటూ ఈ విషయంలో ప్రభుత్వం మరింతగా సేవలను విస్తరించాలని కోరారు. ప్రజలకు మురుగు కలుషిత నీటి వల్ల తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అందువల్ల వరద నీటిలో ఉన్న వారిని తక్షణ సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించాలని కేఎ పాల్ డిమాండ్ చేశారు. తాగు నీరు కూడా లేక చాలా మంది డీ హైడ్రేషన్ కి గురి అయిన సంఘటనలను తాను చూసాను అని ఆయన అన్నారు

వరద ప్రాంతాలలో ప్రజలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని కేఎ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం మేలుకోవాలని ఆయన హెచ్చరించడం విశేషం. కేఎ పాల్ వరద సాయం గురించి పాఠాలు చెబుతాను అంటున్నారు. తన సలహా సూచనలను ప్రభుత్వం వినాలని కోరుతున్నారు. కేఎ పాల్ మాటలను లైట్ తీసుకుంటారా లేక ఆయన చెప్పిన మాటలలో మంచిని తీసుకుంటారా అన్నది చూడాలి.

7 Replies to “వరద సహాయం ఎలా చేయాలో నేర్పిస్తా!”

  1. akkada unnadi vision leni visionary CM, asalu Amaravati ante artificial intelligence nagaram. Human intelligence avasaram ledu. Minimum intelligence unna vadu evadu river lo capital kattadu artificial intelligence valle kadatharu. Appude emindi graphiylo Krishna river mottam retaining wall kattestaru chustu undu.

  2. ఈయన ఏంటో రోజు రోజుకి జగన్ కన్నా బాగా మాట్యూర్డ్ గా కనిపిస్తున్నాడు.. ఈయన కి వున్న ఆలోచానల్లో కొంతైనా ఆ భగవంతుడు జగన్ కి ప్రసాదించి వుంటే బాగుండేది.. వరద సమయంలో బురద రాజకీయాలు చెయ్యకుండా ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తున్న పాల్ గారి ముందు నాకు జగన్ ఒక చిన్న పిల్లోడు లా కనిపిస్తున్నాడు..ఈయన్ని చూసి అయినా ఎదుగు జగన్.. పాల్ గారు సూచించిన దానిలో దాదాపు ప్రభుత్వం చేస్తోంది అనుకోండి అది వేరే విషయం.. నేను ఇక్కడ చెప్పేది ఆయన ఆలోచనా తీరు బాగుంది అని అంటున్నా..

Comments are closed.