బీజేపీకి పురంధేశ్వరి ప్లేస్ లో ఎవరు?

ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీ కాలం రెండేళ్ల పరిమితి పూర్తి అయింది. ప్రస్తుతం బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. జాతీయ స్థాయి నుంచి ఏపీ దాకా అంతటా…

ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీ కాలం రెండేళ్ల పరిమితి పూర్తి అయింది. ప్రస్తుతం బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. జాతీయ స్థాయి నుంచి ఏపీ దాకా అంతటా జరుగుతోంది.

విశాఖలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పురంధేశ్వరి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సభ్యత్వం నలభై రోజుల పాటు మూడు దశలుగా జరిగి అక్టోబర్ నెలాఖరుతో పూర్తి అవుతుంది అని చెప్పారు. ఆ తరువాత జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కొత్త నాయకత్వాలను ఎన్నుకుంటారు అని ఆమె తెలిపారు. ఏపీ బీజేపీకి కూడా దీంతో కొత్త నాయకుడు రాబోతున్నారు అని ఆమె హింట్ ఇచ్చారు.

పురంధేశ్వరి ప్లేస్ లో వచ్చేది ఎవరు అన్నది ఇపుడు కాషాయ శిబిరంలో చర్చిస్తున్నారు. పురంధేశ్వరి హయాంలో ఏపీ బీజేపీ బలపడినట్లే. పొత్తులు ఎత్తులు ఏవైనా కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు గెలవడం అన్నది గతంలో ఎపుడూ జరగలేదు. అలా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.

అయితే ఆమె చూపు కేంద్ర మంత్రి పదవి మీద ఉంది అని అంటున్నారు. ఆమె పార్టీ బాధ్యతలను వదులుకుంటే కేంద్ర మంత్రిగా రావాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ హయాంలో ఆమె కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇపుడు కేబినెట్ ర్యాంక్ మంత్రిగా ఆమె పనిచేయాలని ఆశిస్తున్నారు. విస్తరణలో అయినా ఆమెకు చోటు ఉండవచ్చు అని అంటున్నారు. ఆమె ఏపీ ప్రెసిడెంట్ గా తప్పుకుంటే ఏ సామాజిక వర్గానికి ఏ ప్రాంతానికి చెందిన వారికి పదవి దక్కుతుంది అన్నది కూడా ఆసక్తిని కలిగించే విషయమే. గోదావరి జిల్లాలు, కోస్తా జిల్లాలకు ఈ పదవిని ఇచ్చారు. ఉత్తరాంధ్రకు ఈసారి చాన్స్ ఉండొచ్చా అన్న చర్చ కూడా సాగుతోంది. ఒకరిద్దరు కీలక నేతలు ఈ పదవి కోసం ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలే ఎవరికి ఇస్తారో తేల్చాల్సి ఉంటుంది.

6 Replies to “బీజేపీకి పురంధేశ్వరి ప్లేస్ లో ఎవరు?”

Comments are closed.