సుప్రీం తలుపు తట్టేదాకా.. అజ్ఞాతమేనా?

ఇలాంటి సమయం కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారా

ఇలాంటి సమయం కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారా? అనిపించేలాగా ఏపీ పోలీసులు.. హైకోర్టు తీర్పు వచ్చిన తక్షణం స్పందించారు.

చంద్రబాబునాయుడు నివాసం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పాలన హయాంలో జరిగిన దాడికి సంబంధించి.. పార్టీ నాయకులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు, సుప్రీంలో అప్పీలు చేసుకునే వరకు వారిని అరెస్టు చేయకుండా రక్షణ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది.

హైకోర్టు ఇలాంటి తీర్పు ఎప్పుడు ఇస్తుందా.. తక్షణం రంగంలోకి దిగుదామా అని చాలా రోజుల నుంచి చూస్తున్నట్టుగా పోలీసులు రంగంలోకి దిగారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేయడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో దాడుల విషయంలో కేసులు ఉన్న కీలక నాయకులు, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుని అక్కడనుంచి ఉత్తర్వులు తెచ్చుకునే దాకా అజ్ఞాతంలోకి వెళ్లాల్సిందే అని పలువురు భావిస్తున్నారు. సుప్రీం కోర్టులో గురువారమే అప్పీలు దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో తెలుగుదేశం నాయకుడు అయ్యన్నపాత్రుడు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అత్యంత అసభ్యకరమైన భాషలో తిట్టినందుకు వైసీపీ కార్యకర్తలు ఆగ్రహించారు.

వారి దుడుకు ప్రతిస్పందనలో చంద్రబాబునాయుడు నివాసం మీదికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదికి కూడా వెళ్లారు. పార్టీ కార్యాలయానికి కొంత మేర నష్టం జరిగింది కూడా. ఈ దాడులకు సంబంధించి అప్పట్లోనే పోలీసు కేసులు నమోదు అయ్యాయి.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసులను తిరగతోడి, కొత్త సెక్షన్లు జత చేయించి అయిదుగురు నాయకుల మీద కేసులు పెట్టించింది. నివాసం మీద దాడి కేసులో జోగి రమేష్, పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో నందిగం సురేష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పేర్లున్నాయి.

ఈ నాయకులందరూ ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు వెళ్లారు. ఇన్నాళ్లు వాదప్రతివాదాలు జరిగాయి. తీరా వారికి చేదుగా ధ్వనించే తీర్పు వచ్చింది. వారి విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. అప్పీలుకు వెళ్లే వరకు అరెస్టు చేయరాదని ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు.

నందిగం సురేష్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. మిగిలిన నాయకులు కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

13 Replies to “సుప్రీం తలుపు తట్టేదాకా.. అజ్ఞాతమేనా?”

  1. చట్టానికి దొరక కుండా పరారీ లో ఉండే వాళ్ళని, ఏ పార్టీ వాళ్ళు అయినా, ఎలక్షన్స్ నుండి 6 ఏళ్ళు బహిష్కరించాలి

  2. దాడులు జరిగి ఎన్నాళ్ళు అయ్యింది , కోర్టులు చెప్పేదాకా పోలీసులు ఏమి చేస్తున్నారు ?

  3. Ap high court లో ఈ తీర్పు ఎవరైనా ఊహిస్తారు.అక్కడ న్యాయమూర్తులు మనవారు,ధర్మస్వరూపులు గదా

    1. అంటే అధికారం లో ఉన్నారు కాబ్బటి దడి చేసేయొచ్చా … తప్పు చేయకపోతే పారిపోవడము ఎందుకు ?

  4. When cases were filed in Jaggadus regime why ni action was taken by police since so many years. That to when clear CC camera evidence is available. Now cases should be filed against all concerned sleeping police officers and also on then HM of A P. After poll results when some TDP cadet reacted for the five year long atrocities committed by Jaggadu, he went to Delhi to protest. When YSRCP goondas make arson he said it was reaction. The hiding culprits should be hunted like rabies dogs and put them in jail.

  5. “అత్యంత అసభ్యకరమైన భాషలో తిట్టినందుకు వైసీపీ కార్యకర్తలు”

    No. the leader of ycp is psycho, not common man who supported ycp in 2019..

Comments are closed.