సరిపోదా శనివారం సినిమా కలెక్షన్లు మంగళవారంతో పడిపోయాయి. కానీ నైజాం మినహా మిగిలిన ఏ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. జీఎస్టీలు కలిపినా జస్ట్ సేఫ్ నెంబర్ కు దగ్గరవుతారు తప్ప కమిషన్లు, ఖర్చులు కిట్టుబాటు ఇంకా కావాల్సి వుంది.
ఇలాంటి టైమ్ లో మంగళవారం నుంచి కలెక్షన్లు కిందకు జారిపోయాయి. ఇప్పుడు వాటిని లేపాల్సి వుంది. అలా లేవడానికి అవకాశం కూడా గట్టిగా వుంది. ఎందుకంటే శనివారం, ఆదివారం వరుస సెలవులు వున్నాయి. పైగా వినాయక చవితి పండుగ. అందువల్ల సరిపోదా శనివారం సినిమా కలెక్షన్లు జూమ్ కావడానికి అవకాశం చాలా వుంది. అయితే దీనికి కాస్త పుష్ ఇవ్వాల్సి వుంది.
అందుకోసమే ఈవారం ఓ భారీ సక్సెస్ మీట్ ను నిర్వహిస్తోంది సరిపోదా శనివారం టీమ్. ఈ వారం సరైన సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. విజయ్ గోట్ ఒక్కటే పెద్ద సినిమా అది ఎలా వుంటుందో తెలియదు. దానికి కనుక సరైన టాక్ రాకుంటే సరిపోదా శనివారం ఓన్లీ అప్షన్. అందువల్ల ఈ అడ్వాంటేజ్ ను వాడుకోవాలని చూస్తోంది సరిపోదా శనివారం టీమ్.
సరిపోదా శనివారం నుంచి దేవరకు మధ్యలో ఇంకా మూడు వారాల సమయం వుంది. అంత వరకు అలా అలా ఎంతో కొంత షేర్ లాగుతూ వెళ్తే దేవర వచ్చేలోగా బ్రేక్ ఈవెన్ దాటి ఖర్చులు, కమిషన్ ల వరకు చేరిపోయే అవకాశం వుంది. ఈ వారం విడుదలైన గోట్, 35 సినిమాలు హిట్ కొడితే మాత్రం కథ మారుతుంది. అది వేరే సంగతి.
vc estanu 9380537747
vc available 9380537747
Asha Is trusted person
its good if trusted person. what is vc???
వీడియో కాల్…..మీ పార్టీ నాయకులకు బాగా అలవాటైన ఆట పానుగంటి
Call boy works 8341510897
Nuvvu lepu ra, epudu negativity tappa inka em rada me pages lo