మాజీ మంత్రి అజ్ఞాత‌వాసం …ఇంకెన్నాళ్లు?

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి దాదాపు 45 రోజులుగా అజ్ఞాత‌వాసంలోనే ఉన్నారు. అరెస్ట్ నుంచి త‌ప్పించుకోడానికి ఆయ‌న పోలీసుల క‌న్నుగ‌ప్పారు. అయితే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని ఉద్దేశ‌పూర్వ‌కంగానే పోలీసులు అరెస్ట్…

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి దాదాపు 45 రోజులుగా అజ్ఞాత‌వాసంలోనే ఉన్నారు. అరెస్ట్ నుంచి త‌ప్పించుకోడానికి ఆయ‌న పోలీసుల క‌న్నుగ‌ప్పారు. అయితే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని ఉద్దేశ‌పూర్వ‌కంగానే పోలీసులు అరెస్ట్ చేయ‌కుండా వ‌దిలేసి, ఆయ‌న త‌ప్పించుకున్న త‌ర్వాతే హ‌డావుడి చేశార‌నే విమ‌ర్శ పోలీసుల‌పై వుంది.

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్దంగా పేలుడు పదార్థాల వాడ‌కం త‌దిత‌ర అభియోగాల‌పై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఫిబ్రవరి 16న కేసు నమోదు చేశారు. మైనింగ్ అధికారులే స్వయంగా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు క‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ కాకాణి దాదాపు 43 రోజుల‌పాటు రోజువారీ కార్య‌క‌లాపాలు సాగించారు.

ఆ త‌ర్వాత కాకాణిని అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. దీంతో ఆయ‌న అప్ర‌మ‌త్తం అయ్యారు. ముంద‌స్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆయ‌న ఆశ్ర‌యించారు. కానీ ఊర‌ట ద‌క్క‌లేదు. మ‌రోవైపు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విచార‌ణ‌కు రావాలంటూ ఆయ‌న ఇంటికి రెండు ద‌ఫాలు పోలీసులు నోటీసులు అంటించారు. ఆయ‌న అందుబాటులో లేక‌పోవడంతో చేసేదేమీ లేక పోలీసులు ఊరికే ఉండిపోయారు.

మ‌రోవైపు ఆయ‌న కోసం వెతుకుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు కాకాణి న్యాయ‌పోరాటం కొన‌సాగిస్తున్నారు. స‌ర్వోన్న‌త స్థానంలో అయినా త‌న‌కు ఉప‌శ‌మ‌నం ద‌క్కుతుంద‌ని కాకాణి న‌మ్ముతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడైన కాకాణి అజ్ఞాత‌వాసం కార‌ణంగా, పార్టీ కార్య‌క‌లాపాలు మంద‌గించాయి. కాకాణి అరెస్ట్ అవుతారా? లేక న్యాయ‌స్థానంలో ఊరట పొందుతారా? అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

10 Replies to “మాజీ మంత్రి అజ్ఞాత‌వాసం …ఇంకెన్నాళ్లు?”

  1. ///అయితే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని ఉద్దేశ‌పూర్వ‌కంగానే పోలీసులు అరెస్ట్ చేయ‌కుండా వ‌దిలేసి, ఆయ‌న త‌ప్పించుకున్న త‌ర్వాతే హ‌డావుడి చేశార‌నే విమ‌ర్శ పోలీసుల‌పై వుంది.///

    .

    అర్రెస్త్ చెసె చెశావ్ అంటున్నావ్! చెయపొతె.. ఉద్దెసపూర్వకంగానె అర్రెస్ట్ చెయలెదు అంటున్నావ్!

    1. అంతే కాదు. లిక్కర్ నిందితులందరికి టీడీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయంటారు. మళ్ళీ వైసీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని ఆరోపణ చేస్తారు.

  2. 2029 లో ఎలక్షన్ కోడ్ అమలు అయిన తరువాత వస్తాడు, ఎలక్షన్స్ తరువాత మళ్లీ అజ్ఞాతం లోకి పోతాడు, ఈసారి ఇంకా రాడు.

  3. వీళ్ళందరూ ఉమ్మడిగా నిత్యానంద గారి కైలాస దేశం పాస్ పోర్ట్ లు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళి 2029 ఎలక్షన్ కి వచ్చి వెళితే మంచిదేమో 2029 లో కూడా ఎటు ఓడిపోతారు డబ్బు ఫుల్ గ నొక్కేసింది వుంది కాబట్టి అక్కడ రంజిత వంటివారిని సేవించుకోవచ్చు

Comments are closed.