కాపుల నిబద్దతే కీలకం!

2014, 2019 తరువాత 2024 వేళకు ఆంధ్రలో కాపులు చాలా వరకు చైతన్యవంతం అయ్యారు. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. తెలుగుదేశం అభిమానులు ఎవరైనా అంగీకరించాల్సిన ఇంకో వాస్తవమేమిటంటే ఇప్పుడు ఆంధ్రలో ఆ పార్టీ కి…

2014, 2019 తరువాత 2024 వేళకు ఆంధ్రలో కాపులు చాలా వరకు చైతన్యవంతం అయ్యారు. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. తెలుగుదేశం అభిమానులు ఎవరైనా అంగీకరించాల్సిన ఇంకో వాస్తవమేమిటంటే ఇప్పుడు ఆంధ్రలో ఆ పార్టీ కి ఏమైనా ఊపు వుందీ అంటే అది కేవలం ఈ కాపు సామాజిక వర్గ చైతన్యం వల్లే తప్ప మరోటి కాదు. రోడ్డెక్కుతున్న, హడావుడి చేస్తున్న, సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వాళ్లు అంతా జనసేన లేదా కాపు సామాజిక వర్గ జనాలు తప్ప వేరు కాదు.

ఇప్పుడు ఓటింగ్ సమయం దగ్గరకు వస్తోంది. ఇప్పుడు కాపుల నిబద్దతే విజయానికి మూలం అవుతుంది. కాపులు కనుక గట్టిగా జనసేన పోటీతో సంబంధం లేకుండా కూటమి వైపు వుంటే ఫలితం గురించి పెద్దగా లెక్కలు కట్టాల్సిన పని లేదు. అలా కాకుండా వేరే ఈక్వేషన్లు అన్నీ లెక్కలు తీస్తే ఫలితం గురించి టెన్షన్ పడాల్సి వుంటుంది.

జనసేన పోటీ చేస్తున్న చోట ఈక్వేషన్లు రెండు విధాలుగా వుండే అవకాశం వుంది. కూటమి- వైకాపా అభ్యర్దులు ఇద్దరూ కాపు సామాజిక వర్గం అయితే ఓటింగ్ ఎలా వుంటుంది? ఇద్దరూ నాన్ కాపు సామాజిక వర్గం అయితే కాపు ఓట్లు ఎలా చీలుతాయి? జనసేన వైపు కాపు అభ్యర్ధి కాకుండా, వైకాపా వైపు కాపు అభ్యర్ధి వుంటే కాపు ఓటింగ్ ఎలా మారుతుంది? ఇలా ఈక్వేషన్లు వుంటాయి.

ఉదాహరణకు అనకాపల్లి వైకాపా తరపున కాపు అభ్యర్ధి, జనసేన తరపున గవర సామాజిక వర్గ అభ్యర్ధి. ఇప్పుడు కాపులు కూటమి వైపు వుంటారా? వుండరా? అన్నది ప్రశ్న. ఇదే పరిస్థితి తుని, గాజువాక ఇలా చాలా చోట్ల వుంది. అలాగే ఎంపీ అభ్యర్ధుల విషయంలో కూడా వుంది. ఇలాంటి చోట్ల కాపులు కూటమి వైపు వుండి, అవతలి వారు కూటమి వైపు వుంటే చెప్పేది ఏముంది?

అలా కాకుండా జనసేన తరపున, వైకాపా తరపున కాపులే పోటీ పడితే… ఎలా వుండబోతోంది ఓటింగ్ అన్నది మరో ఈక్వేషన్.

ఈ రెండూ కాకుండా జనసేన పోటీ చేయని చోట, వైకాపా తరపున కాపులు పోటీ చేస్తూ, కూటమి తరపున వేరే వర్గం పోటీలో వుంటే పరిస్థితి ఏమిటి? తుని, గాజువాక లాంటి చోట్ల ఇదే పరిస్థితి వుంది.

కమ్యూనిటీ, పార్టీ, ఇవేమీ కాదు, కాపు ఓట్లు అన్నీ కూటమికే ఎక్కడైనా అంటే ఫలితం గురించి పెద్దగా లెక్కలు కట్టాల్సిన పని లేదు. అలా కాకుండా కాపులు కూడా ఈక్వేషన్లు అన్నీ చూసుకుంటాం అంటే మాత్రం ఆలోచించాలి. ఏదైనా ఈసారి ఎన్నిక ఫలితాల మీద కాపుల నిబద్దత ప్రభావం కీలకంగా వుండబోతోంది.