టీడీపీలో కూనంత అసంతృప్తి?

ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉందా అన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్‌గా ఉంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కిదిన కూన రవికుమార్ తన అసంతృప్తిని సరైన వేదిక మీదనే వ్యక్తం…

ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉందా అన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్‌గా ఉంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కిదిన కూన రవికుమార్ తన అసంతృప్తిని సరైన వేదిక మీదనే వ్యక్తం చేశారా అని పసుపు పార్టీలో తర్కించుకుంటున్నారు.

అసెంబ్లీ సమావేశాలలో కూన రవికుమార్ మాట్లాడుతూ జీరో అవర్ మీద తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తే సమస్యలు కానీ కీలకమైన అంశాలు కానీ మంత్రులు ఎవరూ నోటు చేసుకున్నట్లుగా కనిపించడం లేదని అన్నారు. డ్రైవర్ లేని కారుగా జీరో అవర్ మారింది అని కామెంట్స్ చేశారు. గతంలో ఇలా లేదు. సభ్యులు మాట్లాడినదానిని నోటు చేసుకుంటే వెంటనే సంబంధిత మంత్రులు బదులిచ్చే సంప్రదాయం ఉండేదని అన్నారు.

అయితే దీనికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుంటూ నిండు సభలో అసత్యాలు మాట్లాడవద్దని కూన రవికుమార్‌కు హితవు పలికారు. మంత్రులు నోటు చేసుకుంటున్నారు అని ఆయన చెప్పారు. సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సభ్యులు మాట్లాడే ప్రతీ అంశం మంత్రుల వద్దకు వస్తుందని, దాని మీద తాము తీసుకునే చర్యల గురించి సభ్యులకు తెలియచేస్తామని కూడా చెప్పారు.

ఈ చర్చ ఇలా ఉంటే కూన రవికుమార్ అసంతృప్తి ఇలా వ్యక్తం అయిందా అని పార్టీలో గుసగుసలు పోతున్నారు. ఆయనకు మంత్రి పదవి కచ్చితంగా ఈసారి వస్తుందని భావించారు, అది దక్కలేదు. తీరా చూస్తే విప్ పదవి కూడా ఇచ్చాపురానికి చెందిన ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కి ఇవ్వడం జరిగింది. ఇలా తనకు ఏ పదవీ లభించకపోవడం పట్ల ఆయన కూనంత అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

4 Replies to “టీడీపీలో కూనంత అసంతృప్తి?”

  1. ఎంకటి..నువ్వు కొంచం పెద్ద మనసు చేసుకుని కూన ని వైసీపీ లో చేర్పించరాదూ..

Comments are closed.