ఎక్స్ క్లూజివ్.. త్రివిక్రమ్-బన్నీ..కథ?

2025 ఏప్రిల్‌లో ప్రారంభం కావచ్చు. బన్నీ-త్రివిక్రమ్ ల ఏడు వందల కోట్ల వ్యయంతో నిర్మించే భారీ సినిమా. దీనికి తారాగణం ఎవరు? ఏమిటి? ఇవన్నీ స్క్రిప్ట్ వర్క్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ చూసుకుంటారు.…

2025 ఏప్రిల్‌లో ప్రారంభం కావచ్చు. బన్నీ-త్రివిక్రమ్ ల ఏడు వందల కోట్ల వ్యయంతో నిర్మించే భారీ సినిమా. దీనికి తారాగణం ఎవరు? ఏమిటి? ఇవన్నీ స్క్రిప్ట్ వర్క్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ చూసుకుంటారు. ప్రస్తుతం ఆయన సీరియస్‌గా ఈ స్క్రిప్ట్ పని మీదే ఉన్నారు. అయితే త్రివిక్రమ్ తన తొలి పాన్ ఇండియా భారీ సినిమాకు సబ్జెక్ట్‌గా ఏది ఎంచుకున్నట్లు? మైథలాజికల్ టచ్ అని ఇప్పటికే వినిపించింది. బన్నీ సన్నిహితుడు బన్నీవాస్ కూడా దాదాపుగా అదే చెప్పారు. కానీ బన్నీకి సూటయ్యే మైథలాజికల్ టచ్ సబ్జెక్ట్ ఏమై వుంటుంది? అదే అనుమానం.

ఇలాంటి నేపథ్యంలో ఇంకో మాట కూడా వినిపిస్తోంది. మైథలాజికల్ టచ్ అని పైకి, ప్రస్తుతానికి చెబుతున్నారు. కానీ అది హిస్టారికల్ సినిమా అని వినిపిస్తోంది. చెంఘీజ్ ఖాన్ చరిత్ర తీసుకుని అందులోని ఓ ఎపిసోడ్‌తో సినిమా తీస్తారమే మాట కూడా వినిపిస్తోంది. మంగోలియన్‌లను ఏకంచేసి, చాలా కష్టాలకు ఓర్చి ఎదిగి, వీరుడిగా నిలిచి, శతృవులతో ఆటుపోట్లకు గురై, చివరకు సార్వభౌముడిగా నిలిచినవాడు చెంఘీజ్ ఖాన్.

మరి ఈ కథను త్రివిక్రమ్ ఏ విధంగా దర్శించారు? లేదా మరేదైనా చారిత్రాత్మక వీరుడి కథను తీసుకుంటున్నారా అన్నది కొన్నాళ్లు ఆగితే బయటకు వస్తుంది. సరైన చారిత్రాత్మక సినిమాలు తెలుగులో తక్కువ వచ్చాయి. హిందీలో జోధా అక్బర్, పద్మావతి ఇంకా చాలా వచ్చాయి. బహుశా బన్నీ-త్రివిక్రమ్ కలిసి ఆ లోటు పూడ్చాలనుకుంటున్నారా? గతంలో రుద్రమదేవి సినిమాలో బన్నీ ఓ స్పెషల్ పాత్రలో తళుక్కున మెరిసిన సంగతి గుర్తున్నదే.

ప్రస్తుతానికి అయితే త్రివిక్రమ్-బన్నీ, మైథలాజికల్ టచ్… లేకా హిస్టారికల్ సినిమా అనే గ్యాసిప్ అలా ఉంది. త్వరలో ఫుల్ క్లారిటీ వస్తుంది.

6 Replies to “ఎక్స్ క్లూజివ్.. త్రివిక్రమ్-బన్నీ..కథ?”

  1. Chengiz khan oka villain…malli negative touch vunna oka character ni hero ga potray chestunnaru…Anni neethulu cheptadu aa guruji gadu teesevi matram ilanti stories aa

  2. ఈ మేధావులు అనుకునే వాళ్ళకి మన దేశం లో ఉన్న వీరుల కధలు జీవితాలు ఎందుకు ఇన్స్పైర్ చెయ్యవో ….లేకపోతె చెంగిజ్ ఖాన్ లాంటి వాళ్ళ జీవితాల నుండి ఇన్స్పైర్ అవ్వడం ఏంటి

Comments are closed.