పవన్ క్రేజ్ రెండు జిల్లాలకు మించి లేదా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో తాను అసలు సిసలు భాగస్వామిని అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ నడుమ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. తెలుగువారి…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో తాను అసలు సిసలు భాగస్వామిని అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ నడుమ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. తెలుగువారి ప్రభావం, ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో బిజెపి తరఫున ప్రచారం చేయడానికి ఆయనకు అనేక వినతులు వచ్చినా పట్టించుకోని పవన్ కల్యాణ్.. ఇప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు.

మంచిదే. తెలుగు వారి అస్తిత్వం ఉండే ఏ ప్రాంతంలో పవన్ కల్యాణ్ సభ పెట్టినా జనం వెల్లువలా వస్తారనడంలో సందేహం లేదు. అయితే ఆయనకున్న క్రేజ్ ను ఆయన సొంత పార్టీని పలుచనచేసి తక్కువగా చెప్పుకుంటున్నదా? అనే అనుమానం కలుగుతోంది.

పవన్ కల్యాణ్ షోలాపూర్, లాతూర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో ‘‘గోదావరి జిల్లాలను తలపించేలా సాగిన రోడ్ షో’’ అంటూ చాలా ఘనంగా చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ మహారాష్ట్ర రోడ్ షో అనూహ్యంగా సక్సెస్ అయితే దాన్ని పోల్చుకోవడానికి ఇంతకంటె గొప్ప మాట వారికి దొరకలేదా అని అనిపిస్తుంది.

పవన్ కల్యాణ్ కేవలం గోదావరి రెండు జిల్లాల్లో మాత్రమే ప్రజాదరణ ఎక్కువగా ఉందా? అనే సందేహం కూడా కలుగుతుంది. రెండు జిల్లాలు కాదు కదా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పవన్ కల్యాణ్ రోడ్ షో చేసినా సభ పెట్టినా జనం వెల్లువ ఒకేతీరుగా ఉంటుంది. అయితే ఆయనకున్న అపారమైన క్రేజ్ ను ఆయన సొంత పార్టీ వారే తక్కువచేసి చూసుకుంటున్నారు. ఆయన కేవలం ఒక కులానికి పరిమితమైన నాయకుడిగా స్ఫురించేలా ప్రచారం చేసుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రస్థానాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం గోదావరి జిల్లాలను ముఖ్యమైన కార్యక్షేత్రంగా ఎంచుకుని ఉండవచ్చు. అందుకు కేవలం తన సొంత కులబలం అక్కడ ఎక్కువగా ఉండడమే కారణం కావొచ్చు. కానీ అలాంటి వ్యాపార రహస్యాన్ని వారే ఇలా బహిరంగపరచుకోవడం ఎందుకు? ఆ వ్యూహం తప్పు కదా? అనేది పవన్ అభిమానుల అభిప్రాయం. తమ నాయకుడి గౌరవాన్ని, క్రేజ్ ను సొంత పార్టీ వారే తగ్గించుకోవడం బాలేదని వారు అంటున్నారు.

18 Replies to “పవన్ క్రేజ్ రెండు జిల్లాలకు మించి లేదా?”

  1. బద్దలైనమరోఅబద్దం..

    ================

    వాలంటీర్స్ 34 వేలమందిని కిడ్నప్చేసిఅమ్మేశారుఅనిస్వయానాడీసీఎంచెప్పారు..

    ఇప్పుడు అసెంబ్లీ లోగతఅయిదేళ్లలోకేవలం 34 మందిమాత్రమేఆక్రమరవాణాకుగురిఅయ్యారుఅనికూటమిప్రభుత్వంచెప్పింది

    ================

    జనాలని ఎన్ని విధాలాగాఅబ్బద్దలతోమోసంచెయ్యొచ్చుఅన్నీచేశారు.

  2. పవన్ గూర్చి నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా చెప్పావు GA. ఆంధ్రా లో ఎప్పుడూ కూడా పవన్ కి అస్సలు ఓటు బ్యాంక్ లేదు అన్నట్టుగానే మాట్లాడావు. ఇంక పక్క రాష్ట్రం లో ప్రచారం గూర్చి ఇంతకన్నా నీనుండి ఏమీ ఎక్సపెక్ట్ చేస్తాం😀😀. అవును జగన్ మీద ఏదో ప్రశ్నావళి సందించావు అంట ఎంటి విషయం. 2024 ఎలక్షన్స్ తర్వాత చిల్లర అందడం లేదా ఎంటి🤣🤣

Comments are closed.