వీర‌య్య హ‌త్య కేసు – లాక‌ప్‌డెత్ నిజానిజాలివే!

హ‌త్య కేసు విచార‌ణ‌లో భాగంగా లాక‌ప్‌డెత్ జ‌రిగింద‌నే ప్ర‌చారం పౌర స‌మాజాన్ని ఉలికిపాటుకు గురి చేసింది.

ప్ర‌కాశం జిల్లా టీడీపీ యువ నాయ‌కుడు ముప్ప‌వ‌ర‌పు వీర‌య్య చౌద‌రి హ‌త్య కేసు తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. హ‌త్య జ‌రిగి వారాలు గ‌డుస్తున్నా, ఇంత వ‌రకూ కేసు కొలిక్కి రాక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో హ‌త్య కేసు విచార‌ణ‌లో భాగంగా లాక‌ప్‌డెత్ జ‌రిగింద‌నే ప్ర‌చారం పౌర స‌మాజాన్ని ఉలికిపాటుకు గురి చేసింది.

ఈ విష‌య‌మై లోతుగా విచారించ‌గా, నిజానిజాలేంటో వెలుగు చూశాయి. వీర‌య్య చౌద‌రి హ‌త్యలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ వ్య‌క్తికి ఒంగోలు న‌గ‌రంలో స్నేహితుడున్నాడు. స‌ద‌రు స్నేహితుని పేరులో వెలుగు వుంటుంది. హ‌త్య కేసు విచార‌ణ‌లో భాగంగా నిందితులు వాడిన రెండో వాహ‌నం దొరికిన త‌ర్వాత‌, స‌ద‌రు నిందితుడి స్నేహితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచార‌ణ‌లో భాగంగా స‌ద‌రు వ్య‌క్తి, త‌న‌కు నిందితుడితో ప‌రిచ‌యం ఉన్న మాట వాస్త‌వ‌మే అని, అయితే త‌న‌కు హ‌త్య‌తో ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో అత‌న్ని పోలీసులు విడిచిపెట్టారు. అనంత‌రం ఆ వ్య‌క్తి ఇంటికెళ్లి, భ‌యాందోళ‌న‌కు గురై ఎలుక‌ల మందు తాగిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని గుర్తించిన కుటుంబ స‌భ్యులు ఎలాగోలా మందును బ‌య‌టికి తీశారు. అంతా బాగుంద‌ని అనుకున్నారు.

కానీ రెండురోజుల‌కు స‌ద‌రు వ్య‌క్తి అనారోగ్యానికి గుర‌య్యారు. దీంతో ఒంగోలులోని ప్రైవేట్ ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. కండీష‌న్ సీరియ‌స్‌గా వుండ‌డంతో విజ‌య‌వాడ‌కు తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో లాక‌ప్‌డెత్ అనే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని బాధితుడి కుటుంబ స‌భ్యులు, పోలీసులు చెబుతున్నారు. కేవ‌లం భ‌యంతోనే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్టు సంబంధిత వ్య‌క్తులు చెబుతున్నారు.

5 Replies to “వీర‌య్య హ‌త్య కేసు – లాక‌ప్‌డెత్ నిజానిజాలివే!”

  1. మరి నువ్ ఎందుకురా లాకప్ డెత్ అని టైటిల్ పెట్టావ్ ..?? వ్యూస్ కోసమా ..??

  2. లోకనాథరావు గారు, ఏపీ కింగ్ గారు, నిజాలు కావాలి గారిని గురించి నిజంగా ఆందోళనగా ఉంది. వారికి ఏమైంది అని తెలియడం లేదు. గతంలో వారిలో కొంతమంది అనుచితమైన మాటలు మాట్లాడిన సందర్భాలు మేమంతా చూశాం. ముఖ్యంగా ఏపీ కింగ్ గారు తరచూ కాపు, కమ్మ కులాలపై విమర్శలు చేస్తూ కులపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా వ్యవహరించేవారు. లోకనాథరావు గారు చదువుకున్నవారు అయినప్పటికీ, తరచూ కుల విషయాలను తీసుకురావడం బాధాకరం. అయినప్పటికీ, వారు ఇప్పుడు కనపడటం లేదు. వారు ఆరోగ్యంగా, సుఖంగా ఉన్నారనే ఆశతో, మానవతా దృక్పథంతో మనం వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి

  3. జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల తీర్పు – బానిసత్వానికి గట్టి తిరుగుబాటు!

    ఒకప్పుడు “పేదల నాయకుడు”గా, “బాధితుల పరిరక్షకుడు”గా కనిపించిన జగన్ మోహన్ రెడ్డి గారు, కొద్ది కాలంలోనే తన అసలైన దురుద్దేశాలను ప్రజలకు వెల్లడించారు. ఆయన పాలన ప్రజల అభివృద్ధి కోసం కాదు – ప్రజలపై ఆధిపత్యం చూపించి, వారిని బానిసలుగా మార్చేందుకు సాగిన మిషన్ మాత్రమే.

    వాస్తవం ఏమిటంటే – జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కాదు, వాటిని ఓటు కొల్లగొట్టే ఆయుధాలుగా వాడినందుకు ప్రజలు విసిగిపోయారు.

    “Button నొక్కితే డబ్బు వస్తుంది” అన్న ప్రచారం వెనుక అసలైన అజెండా – “పేదలు నా పాదాలదగ్గరే ఉండాలి, నా మాటే శాసనం!” అని అహంకారపూరితంగా భావించడం.

    ఇది సహనం దాటిపోయిన చర్య. పేదల అవసరాలను, భవిష్యత్తును ఓటుకు అమ్ముకునే వ్యవస్థగా మార్చడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

    ప్రజలు బానిసలు కావాలనుకోలేదు. వారికి కావలసింది – ఆత్మగౌరవంతో、生శక్తితో、生గౌరవంతో、生చేతులతో、生గర్వంగా、生నిలబడి、生పనిచేసుకునే、生జీవితం.

    జగన్ గారు ఈ పాయింట్ పూర్తిగా మిస్సయ్యారు.

    అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికారాన్ని అడ్డుకట్టగా వాడిన జగన్ గారు, కోర్టు ముందు నిర్దోషిగా నిలబడే ధైర్యం చూపించలేదు.

    స్వీయప్రచార పథకాలు – ప్రజల డబ్బుతో, తన పేరు ఫోటోతో, తన భవిష్యత్తు గడపడానికి వాడుకోవడమే అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య.

    తల్లిని, చెల్లిని తాకట్టు పెట్టిన కుటుంబ రాజకీయం, మతాన్ని ఓటు కోసం ఉపయోగించిన చతురత – ఇవన్నీ ప్రజలు గుర్తించి ఖండించారు.

    ఒకవైపు హిందువులుగా నటించడం, మరోవైపు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం – ఇవన్నీ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడాలన్న నీచ రాజకీయ గేమ్. ప్రజలు ఎప్పుడో అర్థం చేసుకున్నారు.

    మూడు రాజధానుల తలపు – అమరావతి రైతుల మీద, ప్రజల కలల మీద తుంచిన నిప్పే అయ్యింది. అక్కడినుంచి ప్రజల తిరుగుబాటు మొదలైంది.

    చివరికి ప్రజలు చెప్పింది ఒక్కటే – “మాకు సంక్షేమం కావాలి, కానీ బానిసత్వం వద్దు! మాకు గౌరవం కావాలి, మోహం కాదు!”

    👉 175 సీట్లలో 11 మాత్రమే రావడం – ఇది ఓటు కాదు, ఒక Revolt!

    👉 జగన్ పాలనపై ప్రజల గట్టిగల సర్జరీ!

    👉 తెలుగు ప్రజలు – మోసం తట్టుకోరు. వారికీ ఆత్మగౌరవం చాలా పెద్దది!

    ఇది మేము ఆశించిన నాయకుడు కాదు…

     ఇది ప్రజలు తిరస్కరించిన అధికారి!

    🇮🇳 ప్రజాస్వామ్యం గెలిచింది!

    ✊ పేదల గర్వం తిరిగి వెలిగింది!

Comments are closed.