నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్‌కు చేరింది. ఈ సందర్భంగా మహిళా శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలతో ఆయన మాట్లాడారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఓ సమాధానం నెటిజన్లకు చేతినిండా పని పెట్టింది. సోషల్ మీడియాలో లోకేశ్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
చిన్నప్పటి నుంచి తనకు చెల్లెలు లేదనే లోటు వుండేదన్నారు. చిన్నప్పటి నుంచి చెల్లి అంటే ఇష్టమన్నారు. తనకు కూడా అమ్మాయి పుట్టాలని కోరుకున్నట్టు లోకేశ్ చెప్పుకొచ్చారు. తన తల్లి తనను క్రమశిక్షణతో పెంచారన్నారు. మొన్న పొరపాటున ఓ మాట అంటే, ఫోన్ చేసి అమ్మ తిట్టారని లోకేశ్ తెలిపారు.
లోకేశ్ కామెంట్స్‌పై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. లోకేశ్‌కు చెల్లి వుంటే, ఈ పాటికి లోకేశ్ రాజకీయ బతుకు బస్టాండ్ అయ్యేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నందమూరి వారసులకు పట్టిన గతే, లోకేశ్‌కు కూడా పునరావృతం అయ్యేదని పోస్టులు పెట్టడం విశేషం. మామను స్ఫూర్తిగా తీసుకుని లోకేశ్‌ను చంద్రబాబు అల్లుడు వెన్నుపోటు పొడిచే వాడని వ్యంగ్యంగా టీడీపీ యువకిశోరానికి చీవాట్లు పెడుతున్నారు.
లోకేశ్ తెలివి తేటలు తెలిసే, తనకు అల్లుడు వస్తే వెన్నుపోటు పొడిస్తాడనే ముందు జాగ్రత్తలు తీసుకుని, మరో బిడ్డకు బాబు ప్రయత్నించలేదని నెటిజన్లు తమదైన క్రియేటివిటీతో పోస్టులు పెట్టడం విశేషం. రాజకీయాల్లో తన వ్యవహార శైలిని గుణపాఠంగా తీసుకుని, బామ్మర్దులకు పట్టిన గతి, కొడుక్కు పట్టకూడదనే బాబు వ్యూహాత్మకంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపించడం విశేషం.