విశాఖ విషయంలో కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతోంది అని అంటున్నారు. అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో విశాఖ మీదనే ఎక్కువగా మాట్లాడింది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని చెప్పినా అమలు కాలేదు. విశాఖలో భూ కబ్జాలు జరిగాయని ప్రతిపక్షాలు నాడు విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
ఏపీలో ఇప్పటికిపుడు చూస్తే అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది. దాంతో విశాఖను కేంద్రంగా చేసుకోవాలని టీడీపీ కూడా భావిస్తోంది. విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తారు అని అంటున్నారు.
జిల్లా ఇంఛార్జి మంత్రి నాయకత్వంలోనే పాలన సాగుతుంది. అభివృద్ధి కార్య్రకమాలకు కూడా ఆయన అనుమతి కావాలి. జిల్లా పరిషత్ సమీక్షా సమావేశాలకు జిల్లా ఇంఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు.
నారా లోకేష్ ఐటి మంత్రిగా కూడా ఉన్నారు. విశాఖను ఐటీ పరంగా అభివృద్ధి చేయాలన్నా విశాఖను పారిశ్రామికంగా డెవలప్ చేయాలన్నా ప్రభుత్వానికి వారధిగా ఇంచార్జి మంత్రి ఎంతో కీలకంగా వ్యవహరిస్తారు. ఆ బాధ్యతను లోకేష్ తీసుకోవడం అంటే నేరుగా చంద్రబాబే విశాఖను మోనిటగింగ్ చేసినట్లు అవుతుందని పార్టీ నేతలు అంటున్నారు.
విశాఖ వంటి పెద్ద జిల్లాకు ఒక్కరే మంత్రి ఉన్నారు. దాంతో ఆ లోటుని భర్తీ చేయడంతో పాటు పార్టీని పటిష్టం చేసుకోవడం, వైసీపీని పూర్తిగా దెబ్బ తీయడం వంటి అనేక లక్ష్యాలతో నారా లోకేష్ కి విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.