ఈ ఏడాది జనవరిలో కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టారు. పాదయాత్ర మొదటి అడుగే దివంగత ఎన్టీఆర్ మనుమడైన తారకరత్నను బలి తీసుకుంది. అప్పట్లో లోకేశ్ లెగ్‌పై ప్రత్యర్థులు విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా లోకేశ్ పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ పల్లెలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున ఓ చర్చకు తెరలేచింది. లోకేశ్ నడుస్తుండడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడలేదని ముఖ్యంగా రైతులు అనుమానిస్తున్నారు.
తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్న విషయాన్ని రైతులు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. లోకేశ్ లెగ్ బాబూ… లెగ్ అని గ్రామీణులు నిరాశతో అంటున్నారు. లోకేశ్ తండ్రి చంద్రబాబుపై కూడా రైతాంగంలో ఇదే అభిప్రాయం బలంగా వుంది. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ పుష్కలంగా వర్షాలు పడవనే విమర్శ వుంది. అందుకే చంద్రబాబును గ్రామీణ సమాజం తమ వ్యతిరేకిగా చూస్తుంటుంది.
ప్రస్తుతం లోకేశ్ కూడా దురదృష్టవశాత్తు అలాంటి అపప్రదనే మూటకట్టుకుంటున్నారు. లోకేశ్ అడుగులు శుభ సూచికంగా వుండి వుంటే… ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిసేవని రైతులు రచ్చ బండల వద్ద మాట్లాడుకుంటున్నారు. లోకేశ్ పాదముద్ర మంచిది కాదేమో అని అనుమానిస్తున్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో విస్తారంగా వర్షాలు కురిశాయి.
అయితే ఇప్పుడు లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం మొదలు పెట్టడంతో, రైతులకు ఖరీఫ్‌లో అవసరమైన సమయంలో వాన పడకపోవడం వారిని నిరాశ పరుస్తోంది. కనీసం నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడాల్సి వుంది. అయినా రుతు పవనాలు ఏపీ వైపు బలంగా తొంగి చూడడం లేదు. అక్కడక్కడ చెదురుమదురు వానలు తప్ప, బలంగా కురవడం లేదు.
అయితే లోకేశ్ పాద మహిమపై సాగుతున్న చర్చల్లో శాస్త్రీయ లేదు. అయితే శాస్త్రీయత కంటే సెంటిమెంట్సే ఎక్కువ ప్రభావం చూపుతుంటాయి. ఆ కోణంలో లోకేశ్‌పై ఏపీ సమాజంలో జరుగుతున్న చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది.