ఏపీ వస్తే సీఐడీ తనను అరెస్టు చేస్తుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఢిల్లీలో తలదాచుకున్నాడు నారా లోకేష్ అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇటీవలే పాదయాత్ర సందర్భంగా.. లోకేష్ ఒక రేంజ్ లో బీరాలు పలికాడు! అరేయ్.. ఒరేయ్.. జగన్ రెడ్డి అంటూ మాట్లాడాడు! తనను చూసి జగన్ భయపడుతున్నాడు.. అంటూ లోకేష్ చెప్పుకోని రోజంటూ లేదు!
ఆయన పాదయాత్ర సాగినన్ని రోజులూ.. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం.. మూడు పూటలా తనను చూసి జగన్ భయపడుతున్నాడని చెప్పుకుని తృప్తి పొందాడు చంద్రబాబు తనయుడు. అలాగే ఎర్ర బుక్కు ఒకటి మెయింటెయిన్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించుకున్నాడు.
అందరి పేర్లూ అందులో రాసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చాడు. రేపు అధికారం తమ చేతికి అందితే అందరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉంటాయంటూ బాహాటంగా చెప్పుకొచ్చాడు!
ఒకసారి కాదు, కొన్ని వందల సార్లు ఇలా ప్రకటించుకున్నాడు లోకేష్. మరి ఆ సంగతేమో కానీ తనను చూసి జగన్ భయపడుతున్నాడని వందల సార్లు ప్రకటించుకున్న లోకేష్, ఇప్పుడు భయంతో ఢిల్లీలో దాక్కోవడం గమనార్హం!
ఏపీ వస్తే తనకు జైలే గతి అని లోకేష్ భయపడుతున్నట్టుగా ఉన్నాడు. లాయర్లతో మాట్లాడటానికి లోకేష్ ఢిల్లీలో కూర్చున్నారట! మరి ఇంకా ఎన్ని రోజులు మాట్లాడతారు? ఇప్పటికే వారం గడిచిపోయినట్టుగా ఉంది. మరి ఇక్కడ జైల్లో ఉన్న తండ్రిని చూడ్డానికి కానీ, పార్టీ పరిస్థితిని పట్టించుకోవడానికి కానీ, తల్లి, భార్యలకు ధైర్యం చెప్పడానికి లోకేష్ రావడం లేదు!
అలాగే చంద్రబాబు అరెస్టును తాళలేక వీరాభిమానుల గుండెలు ఆగిపోతున్నట్టుగా కూడా ఆంధ్రజ్యోతి చెప్పింది కదా! మరి ఇంత జరుగుతుంటే లోకేష్ ఇంకా ఎన్ని రోజులు అక్కడ కూర్చుని దాక్కొంటాడనేది చర్చనీయాంశంగా మారింది!