మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా ఊహించినట్లే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలు కాగానే తన కొడుకు నారా లోకేష్ పాదయాత్ర సైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది. దాదాపు ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తనతో కలిసి నడుస్తున్న నేపథ్యంలో.. నెల్లూరు జిల్లాలో తానేదో నిరూపించుకోవాలని ఆరాటపడిన లోకేష్ ఆశలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదిలోనే దెబ్బేశారు.
ఇలా జరుగుతుందని మొదటే భావించి పవన్ కళ్యాణ్ యాత్రని కొన్ని నెలల పాటు పెండింగ్లో పెట్టిన చంద్రబాబు నాయుడు దాదాపు లోకేష్ పాదయాత్ర 4 నెలలపైగా దాటిన నేపథ్యంతో పాటు.. అందులోనూ వైసీపీ కంచుకోట లాంటి రాయలసీమలో యాత్ర కంప్లీట్ అయిపోయిందని భావించి పాదయాత్రకు ఇంకా ఇబ్బందులు ఉండవని పవన్ కళ్యాణ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పవన్ యాత్ర మొదలుపెట్టారు. పవన్ యాత్ర మొదలు పెట్టాగానే లోకేష్ గురించి టీడీపీ సామాజిక మీడియా జనాలు కానీ వైసీపీ వర్గాలు పట్టించుకోవడం లేదు.
స్వతహాగా సినిమా యాక్టర్ కావడంతోపాటు ఒళ్లంతా జగన్ పై ద్వేషం పెంచుకున్న పవన్ కళ్యాణ్ యాత్ర మొదలుపెట్టగానే తెలివిగా వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ తనకు ప్రాణహాని ఉంది అంటూ రాజకీయ రక్తి కట్టిస్తూ మీడియా ఫోకస్ మొత్తం తనవైపు తిప్పుకున్నారు. ఉమ్మడి నెల్లూరుకు చెందిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో జగన్ ప్రభుత్వం పై విమర్శలు దాడి చేద్దామని లోకేష్ ప్లాన్ మొత్తం పవన్ కళ్యాణ్ వల్ల చెడిపోయింది.
బహుశా పవన్ యాత్ర ఈ వారంలో ముగుస్తుంది.. ఇప్పటి పరిణామాలు గమనించిన చంద్రబాబు మరో దపా పవన్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు కాస్తా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటున్నారు టీడీపీ శ్రేణులు. లోకేష్ పాదయాత్ర గుంటూరులోకి అడుగు పెట్టే వరకు పవన్ కళ్యాణ్‌ను సినిమాలకు మాత్రమే పరిమితం చేసి.. కావాలంటే నెలలో ఒక రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి మాత్రమే పరిమితం చేసే విధంగా ప్లాన్ చేయాలని లోకేష్ వర్గం భావిస్తోంది.