తిరిగి తిరిగీ మళ్ళీ భీమిలీకి….?

భీమిలి ఈ పేరులో ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. చక్కని సాగర తీరం, ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి. ఇలా భీమిలీను సెల్యూలాయిడ్ మీద ఎక్కించేసి తమ సినిమాలను సక్సెస్ చేసుకున్న దర్శక నిర్మాతలు…

భీమిలి ఈ పేరులో ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. చక్కని సాగర తీరం, ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి. ఇలా భీమిలీను సెల్యూలాయిడ్ మీద ఎక్కించేసి తమ సినిమాలను సక్సెస్ చేసుకున్న దర్శక నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు.

భీమిలీ నుంచి రాజకీయాలను మొదలెట్టి మహా మహా పదవులు అందుకున్న వారూ ఉన్నారు. భీమిలీ ఎపుడూ అలా అందరినీ ఆకర్షిస్తుంది. అలాంటి భీమిలీ మీద ఒక యువ నాయకుడు మనసు పారేసుకున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయనే టీడీపీ భావి వారసుడు నారా లోకేష్.

నిజానికి లోకేష్ 2019 ఎన్నికల్లోనే భీమిలీ  నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ చివరి నిముషాన రూట్ మార్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన భీమిలీ నుంచి పోటీ చేస్తారా అంటే గత కొంతకాలంగా సాగిన చర్చ ఆగి ఇపుడు మళ్ళీ స్టార్ట్ అవుతోంది. దాన్ని బట్టి చూస్తే లోకేష్ భీమిలీలోనే బరిలోకి దిగుతారు అని అంటున్నారు

మరి మంగళగిరి సంగతేంటి అంటే అక్కడ పోటీ చేస్తానని చెప్పినా లేటెస్ట్ గా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన బీసీ నేత గంజి చిరంజీవి ప్రభావం ఉంటుందేమో అన్న ఆలోచన పార్టీలో ఉందని అంటున్నారుట. లేదా అక్కడా ఇక్కడా కూడా పోటీ చేసే ఆలోచన కూడా ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే భీమిలీ నుంచి లోకేష్ పోటీ చేస్తారని ఆ పార్టీ  వారు బాహాటంగా చెప్పడంలేదు కానీ వైసీపీకి చెందిన రాజమండ్రీ ఎంపీ భరత్ అయితే ఓపెన్ గానే ఈ సీక్రెట్ చెప్పేశారు. పైగా ఆయన అక్కడా ఇక్కడా పోటీ ఎందుకు నేరుగా రాజమండ్రీ వచ్చేయ్. ఇద్దరం కలసి తేల్చుకుందామని ఒక అందమైన సవాల్ కూడా విసిరారు. ఆయన సవాల్ సంగతి ఎలా ఉన్న లోకేష్ భీమిలీ నుంచి పోటీ  అంటే రేసులో ఉన్న లోకల్ టీడీపీ  లీడర్స్ లో కలవరం రేగుతోందిట.