రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారు. ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం ప్రతి అవకాశాన్ని ఆయన వినియోగించాలని అనుకుంటున్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు పని చేస్తున్నట్టు లోకేశ్ ఢిల్లీ పర్యటనలో వెల్లడించారు. పరిశ్రమలో స్థాపనలో భాగంగా ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ప్రయత్నం సీరియస్‌గా ఎప్పుడూ జరగలేదనే విమర్శ వుంది. కానీ ఏపీలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల కోసం కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందన్న సంకేతాలు జనంలోకి వెళుతున్నాయి.
తాజాగా న్యూ ఢిల్లీలో యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ పోరం లీడర్‌షిప్ సమ్మిట్‌లో లోకేశ్ పాల్గొన్నారు. ఫైర్ సైడ్ సంభాషణలో ఆపిల్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ విరాట్ భాటియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సూటిగా సమాధానాలిచ్చారు. వేగవంతమైన ఆర్థిక,సామాజిక అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై లోకేశ్ ప్రసంగిస్తూ పరిశ్రమల అనుమతులను వేగంగా ఇచ్చేందుకు ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డును పునరుద్ధరించామన్నారు. ప్రైవేటు సెక్టారు ప్రముఖులతో సలహా మండలి ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా అనుమతులు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులు, అనుమతులకు సంబంధించి ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతివారం ఇన్వెస్టర్స్ కు అప్ డేట్ చేస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. తొలివిడతలో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా హౌస్ హోల్డ్ డాటా, ఎడ్యుకేషన్ డేటా మైక్రో లెవల్‌లో సేకరిస్తున్నట్టు లోకేశ్ వెల్లడించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సాధించాలన్న తమ లక్ష్యానికి స్కిల్ సెన్సస్ దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రాంతాల వారీగా అభివృద్ధికి ఫోకస్ పాయింట్లను నిర్దేశించినట్టు లోకేశ్ తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజ్, పెట్రో కెమికల్, ఫార్మా రంగాలకు పెద్దపీట వేస్తామన్నారు. 2029నాటికి 72 గిగావాట్స్ రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు లోకేశ్ తెలిపారు.
Business magnets tho Vizag to summit pettadu Jagan… adi kuda teliyakunda ela GA? EVM government vi publicity thappa reality vundadu… 2014-19 lo enni government and private jobs vachayooo cheppu nuvvina nee Loki aina?
vc available 9380537747
Good work by Lokesh….
This is called governence..
THis is not Governence , its a fake news factory and all are fake
పర్లేదు…he is improving. Good good
గ్రేట్ వర్క్
జగ్గూ గాడు ఇలా ఎప్పుడన్నా మాట్లాడాడా?
Jagan is far better than CBN, Lokesh . This Governament is only paper king. False promises made to get power. Atleast Jagan is pure. Lokesh is 0.10% compared to jagan. Dont even compare with him Bro
అంతా బాగానే ఉంది కానీ … ఆ కే సు లు గురించి కూడా ఆలోచన ఉండాలి .. లేకపోతే మాలాంటి కార్యకర్తలు పడ్డ బాధలు మీకేమి తెలుసు ..
Pulli kadupulo pilliii