యల్లమ్మ – నాని నుంచి నితిన్ వరకు

బలగం సినిమాతో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న వేణు త‌న‌ మరో సినిమా యల్లమ్మ. తెలంగాణ గ్రామీణ పద్దతుల నేపథ్యంలో రాసుకున్న కాంతారా లాంటి బలమైన కథ. ఈ కథను విని చాలా ఇష్ట…

బలగం సినిమాతో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న వేణు త‌న‌ మరో సినిమా యల్లమ్మ. తెలంగాణ గ్రామీణ పద్దతుల నేపథ్యంలో రాసుకున్న కాంతారా లాంటి బలమైన కథ. ఈ కథను విని చాలా ఇష్ట పడ్డారు హీరో నాని. కానీ అప్పటికే దసరా కాంబినేషన్ లో సినిమా ఓకె చేసాడు. అది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ రూటెడ్ స్టోరీ. అందుకే ఈ సినిమా చేయలేనని స్మూత్ గా చెప్పేసాడు. దాంతో అదే కథను పట్టుకుని ఎవరితో చేస్తే బాగుంటుందా అని ప్రయత్నించారు.

ముందుగా వరుణ్ తేజ్ పేరు డిస్కషన్ లోకి వచ్చింది. అక్కడ కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. తరువాత హనుమాన్ హీరో తేజ సజ్జా దగ్గరకు వచ్చింది. ఇంత ఎర్లీ స్టేజ్‌లో ఈ సినిమా చేయచ్చా.. వద్దా అన్న మీమాంస ఎదురయింది. అంతకు ముందే నితిన్ ను అనుకున్నారు కానీ ఒకే బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ అవుతుంది అని అలోచించారు. చివరకు అక్కడే చేయాలని డిసైడ్ చేసారని తెలుస్తోంది.

నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతోంది, యల్లమ్మ మూడో సినిమా. ఇది కాక విక్రమ్ కే కుమార్ తో నిరంజ‌న్ రెడ్డి డిస్కషన్లో వుంది. అంటే మొత్తం 2025 వరకు నితిన్ డైరీ ఫుల్ అయిపోయినట్లే.

One Reply to “యల్లమ్మ – నాని నుంచి నితిన్ వరకు”

Comments are closed.