ప‌వ‌న్ అవ‌మానించ‌డాన్ని మ‌న‌సులో పెట్టుకుంటాం

హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌పై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్ రేకెత్తించిన వివాదం ఇంకా కొన‌సాగుతోంది. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన అనిత‌ను అన్యాయంగా మాట్లాడార‌నే ఆవేద‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది. ఇదే విష‌యాన్ని ఎమ్మార్పీఎస్…

హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌పై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్ రేకెత్తించిన వివాదం ఇంకా కొన‌సాగుతోంది. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన అనిత‌ను అన్యాయంగా మాట్లాడార‌నే ఆవేద‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది. ఇదే విష‌యాన్ని ఎమ్మార్పీఎస్ అగ్ర నాయ‌కుడు మంద కృష్ణ మాదిగ బ‌య‌ట పెట్టారు.

మీడియాతో కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఏదైనా వుంటో కూచొని మాట్లాడుకోవాల్సింద‌న్నారు. అలా కాకుండా మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి అనిత‌ను అవ‌మానించేలా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడ్డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ చేసిన అవ‌మానాన్ని మ‌న‌సులో పెట్టుకుంటామ‌ని ఆయ‌న సున్నితంగా హెచ్చ‌రించారు. చిన్న‌పిల్ల‌ల మాదిరిగా ప‌వ‌న్ మాట్లాడిన‌ట్టు వుంద‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ప‌వ‌న్ త‌న శాఖ‌లో విఫ‌లం అయ్యార‌ని ఎవ‌రైనా విమ‌ర్శిస్తే ఎట్లా వుంటుంది? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేబినెట్ పెద్ద చంద్ర‌బాబు ఉన్నార‌ని, అనిత శాఖ గురించి మాట్లాడ్డానికి ప‌వ‌న్ ఎవ‌ర‌ని ఆయ‌న నిల‌దీశారు.

శాంతి భ‌ద్ర‌త‌లు లేవ‌ని ప‌వ‌న్ విమ‌ర్శిస్తే, అదంతా హోంశాఖ మంత్రికి ఇబ్బందా లేక ప్ర‌భుత్వానికా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగ స‌భ‌లో ఎలా మాట్లాడ్తార‌ని ఆయ‌న నిల‌దీశారు. ప‌వ‌న్ మాట్లాడింది స‌రైంది కాద‌న్నారు. కేవ‌లం హోంశాఖ మంత్రి అనిత‌నే కాకుండా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును అవ‌మానించేలా ప‌వ‌న్ కామెంట్ చేశార‌ని మంద కృష్ణ మాదిగ అన్నారు. ప‌వ‌న్ కామెంట్స్‌ను తాము అంగీక‌రించ‌మ‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందే ప‌వ‌న్‌పై తాము అసంతృప్తి వ్యక్తం చేశామ‌న్న సంగ‌తిని ఆయ‌న బ‌య‌ట పెట్టారు.

ప‌వ‌న్ సామాజిక న్యాయం గురించి మాట్లాడ్తార‌ని, మ‌రి ఆయ‌న తీసుకున్న మూడు సీట్ల‌లో ఒక్క‌టైనా త‌మ‌కు ఇవ్వ‌లేద‌న్నారు. గ‌తంలో త‌మ అవేద‌న చెబుతామంటే ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌న్నారు. జ‌న‌సేన అంటే ఒక‌ట్రెండు కులాల పార్టీనా? అంద‌రి పార్టీనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. స‌మ‌యం వ‌స్తే ప‌వ‌న్ గురించి చాలా మాట్లాడ్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. కాపుల‌కే మాత్ర‌మే ప‌వ‌న్ పెద్ద‌న్న అని ఆయ‌న విమ‌ర్శించారు.

19 Replies to “ప‌వ‌న్ అవ‌మానించ‌డాన్ని మ‌న‌సులో పెట్టుకుంటాం”

  1. ఇక్కడ కులం ఎందుకు తీస్తారు. ప్రతిదానికీ ఈ కుల సంఘాలు పోలో మని ఐనదానికి… కాని దానికి వచ్చేస్తారు… వీళ్ళని షూట్ చేయాలి ఫస్ట్ అస్సలు. ఒక దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేస్తే లేవని నోళ్ళు.. పనితనం మెరుగుపరచుకోమని చెప్తే … అదేదో పెద్ద తప్పిదం లాగా తెగ లేస్తున్నాయి.

  2. ఏందయ్యా మంద కృష్ణా నువ్వు ఇచ్చేది? ప్యాకేజీ ఇవ్వగల కెపాసిటీ ఉందా నీకు? ప్యాకేజీ ఇచ్చి బూతులు తిట్టు, మా గాలోడు పడతాడు….. అంతే తప్ప ఈ సోది కబుర్లు వద్దు

  3. అంటే దళిత మంత్రులకు ౩౦ శాతం పని అప్పచెప్పాలని ఈయన వుద్దేశ్యమా? ప్రభుత్వ వ్యవహారాల్లో మంద జోక్యం అనవసరం.

Comments are closed.