ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా చెప్పించిన తర్వాతే వారిని అప్రూవర్లుగా అనుమతించారని, రాఘవకు బెయిల్ కూడా దక్కిందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అబిషేక్ సింఘ్వీ బుధవారం ఈడీ ప్రత్యేకకోర్టులో వాదించారు.
అంతేకాక కేజ్రీవాల్ పేరు చెప్పినందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయనకు ఒంగోలు నుంచి సీటుకూడా ఇచ్చారని సింఘ్వీ చెప్పారు. ఇది క్విడ్ ప్రో కాదా అని ఆయన గట్టిగా వాదించడంతో ఈడీ న్యాయవాది అదనపు సాలిసిటర్ జనరల్ జవాబు చెప్పలేకపోయారు.
నిజానికి మాగుంటకు తెలుగుదేశం ఒంగోలు నుంచి సీటు ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడు బిజెపి నేతలకు చెప్పలేదట. మాగుంటకు తెలుగుదేశం సీటు ఇవ్వడం, కూటమి అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడంతో ఢిల్లీలో బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీని వల్ల కేజ్రీవాల్ పై కేసు బలహీనపడిందని వారంటున్నారు.