ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాని,లోక్ సభ ఎన్నికల్లో కానీ తమ కూటమి విజయాలు సాధించే అవకాశాలు లేవని సీనియర్ బిజెపి నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో రెండు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని ఇంటలిజెన్స్ వర్గాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదిక పంపినట్లు తెలిసింది.
మొదటిది, తనకు అమ్ముడుపోయిన జనసేన ద్వారా తన అభ్యర్థులనే చంద్రబాబు నిలబెట్టిస్తుండడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారి ఓట్లేవీ చంద్రబాబుకు పడవని ఐబీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదేమిటి, పవన్ కల్యాణ్ ఒత్తిడి చేస్తేనే కదా, పొత్తుకు ఒప్పుకున్నాం. ఆ యాక్టర్ కు వెన్నుముక లేనట్లుందే అని మోదీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
రెండవది, వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందకుండా చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తెలుగుదేశంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకునట్లు ఢిల్లీకి సమాచారం అందింది. తమ వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేశ్ ద్వారా ఎన్నికలకమిషన్ కు ఫిర్యాదుచేసి చంద్రబాబు జనానికి పింఛన్ అందకుండా చేశారన్న సమాచారం రాష్ట్రమంతా పాకిపోయింది. ఇది సెల్ఫ్ గోల్ అని బిజెపి నేతలు అంటున్నారు.
ఇక రఘురామ కృష్ణం రాజును తాము వద్దని ఛీత్కరిస్తున్నా, అతడికే నరసాపురం సీటు ఇవ్వాలని, లేకపోతే బిజెపి అభ్యర్థిని ఎమ్మెల్యేగా పోటీచేస్తే తామే రఘురామకు సీటిస్తామని చంద్రబాబు ఒత్తిడి చేయడం కూడా బిజెపి అగ్రనేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మాకు ఒకసారి సీట్లిచ్చాక మాటిమాటికీ మాపై ఒత్తిడి తేవడం దేనికి అని బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రఘురామరాజు పరిస్థితి ఆత్మహత్యాసదృశంగా మారింది.