ఎస్సీ, ఎస్టీల‌కు ఉచిత విద్యుత్ అందిస్తాం

ఎస్సీ, ఎస్టీల‌కు ఉచిత విద్యుత్ నిలిపివేస్తామ‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అన్నారు.

ఎస్సీ, ఎస్టీల‌కు ఉచిత విద్యుత్ నిలిపివేస్తామ‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అన్నారు. వైసీపీ మీడియాలో ఎస్సీ, ఎస్టీల‌కు ఉచిత విద్యుత్‌ను క‌ట్ చేసి వారికి కూట‌మి స‌ర్కార్ షాక్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చార‌మ‌వుతోంది. నెల‌కు 200 యూనిట్ల లోపు వాడినా క‌రెంట్ బిల్లు క‌ట్టాల్సిందే అని ద‌ళితులు, గిరిజ‌నుల‌కు తాఖీదులు వ‌స్తున్న‌ట్టు ఆ ప్ర‌చారం సారాంశం. పాత బ‌కాయిలు క‌ట్టాల‌ని వాళ్లంద‌రికీ బిల్లులు వ‌స్తున్నాయ‌ని, ఒక‌వేళ చెల్లించ‌క‌పోతే విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్టు బాధితుల ఆవేద‌న‌ను వైసీపీ ప‌త్రిక‌లో రాసుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా ద‌ళితులు నిర‌స‌న‌కు దిగ‌డానికి సంబంధించిన ఫొటో కూడా వైర‌ల్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో మంత్రి గొట్టిపాటి వివ‌ర‌ణ ఇచ్చారు. 200 యూనిట్ల వ‌ర‌కు ఎస్సీ, ఎస్టీల‌కు ఉచిత విద్యుత్ అందించ‌డానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి వుంద‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లు క‌ట్టాల‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని ఆయ‌న అన్నారు.

అర్హులైన ఎస్సీ, ఎస్టీలు ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని గొట్టిపాటి కోరారు. అస‌లు ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని అమ‌లు చేసిందే టీడీపీ ప్ర‌భుత్వ‌మ‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 15,17,298 ఎస్సీ కుటుంబాలు, అలాగే 4,75,557 ఎస్సీ కుటుంబాల‌కు త‌మ ప్ర‌భుత్వం ఉచిత విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంద‌న్నారు. దీనిపై ఎవ‌రైనా అస‌త్య ప్ర‌చారాన్ని చేస్తే న‌మ్మొద్ద‌ని మంత్రి కోరారు.

7 Replies to “ఎస్సీ, ఎస్టీల‌కు ఉచిత విద్యుత్ అందిస్తాం”

  1. మరి ఎందుకు ఆందోళన లు చేశారు.. కొన్ని చోట్ల implement చేసి, వ్యతిరేకత వస్తే వెంటనే ఆబ్బెబ్బే అలాంటిది ఏమి లేదు అని బుకాయించటం

Comments are closed.