మ‌హిళ‌ల‌పై ఇవేం కామెంట్స్ స‌విత‌మ్మ‌

శాస‌న మండ‌లిలో మంత్రుల మాట‌లు అదుపు త‌ప్పుతున్నాయి. వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ గురువారం మండ‌లిలో మాట్లాడుతూ వంద ఎలుక‌లు తిన్న పిల్లి హ‌జ్‌యాత్ర‌కు పోయింద‌న్న‌ట్టుగా వుంద‌ని ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను ఎద్దేవా చేయ‌డం తీవ్ర దుమారం…

శాస‌న మండ‌లిలో మంత్రుల మాట‌లు అదుపు త‌ప్పుతున్నాయి. వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ గురువారం మండ‌లిలో మాట్లాడుతూ వంద ఎలుక‌లు తిన్న పిల్లి హ‌జ్‌యాత్ర‌కు పోయింద‌న్న‌ట్టుగా వుంద‌ని ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను ఎద్దేవా చేయ‌డం తీవ్ర దుమారం రేపింది. ముస్లింల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా మంత్రి మాట్లాడార‌ని వైసీపీ స‌భ్యులు విరుచుకుప‌డ‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది.

ఇవాళ మ‌రో మంత్రి స‌విత మ‌హిళ‌ల‌పై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. దీంతో మండ‌లిలో వైసీపీ స‌భ్యులు తీవ్ర నిర‌స‌న తెలిపారు. గ‌త ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా వ‌చ్చే డ‌బ్బుల ద్వారా మ‌హిళ‌లు ప‌నిలేక‌ గంజాయికి, మ‌ద్యానికి బానిస‌ల‌య్యార‌ని అన్నారు. దీంతో వైసీపీ స‌భ్యులు మంత్రిపై విరుచుకుప‌డ్డారు.

మంత్రి స‌విత త‌న కామెంట్స్‌ని వెన‌క్కి తీసుకోవాల‌ని మండలి చైర్మ‌న్ మోషెన్‌రాజు విజ్ఞ‌ప్తి చేశారు. మంత్రి కామెంట్స్‌ను రికార్డుల నుంచి తొల‌గిస్తున్న‌ట్టు మండ‌లి చైర్మ‌న్ తెలిపారు. అయితే త‌న కామెంట్స్‌ను వైసీపీ స‌భ్యులు వ‌క్రీక‌రించార‌ని మంత్రి స‌విత వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే మంత్రి వివ‌ర‌ణ‌తో వైసీపీ స‌భ్యులు సంతృప్తి చెంద‌లేదు. మ‌హిళ‌ల‌ను మంత్రి అవ‌మానించార‌ని వైసీపీ స‌భ్యులు ఆరోపించారు.

మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ బీసీ మ‌హిళా మంత్రి అయిన స‌విత ఇలా మాట్లాడ్డం ఆవేద‌న క‌లిగిస్తోంద‌న్నారు. రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ మంత్రి స‌విత క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అని ముక్త కంఠంతో వైసీపీ స‌భ్యులు డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాత మీడియా స‌మావేశంలో కూడా వైసీపీ స‌భ్యులు మంత్రి కామెంట్స్‌ను త‌ప్పు ప‌ట్టారు.

9 Replies to “మ‌హిళ‌ల‌పై ఇవేం కామెంట్స్ స‌విత‌మ్మ‌”

      1. anni freebies ekkada remove chesaru. old govtlo oka student ammavadi dabbulu isthe, TDP lo intlo andari kids ki istahm ani promise chesaru kada, adi eppudu? is this promise making every student junkie?

Comments are closed.