ఎమ్మెల్యే ఆది దెబ్బా.. మ‌జాకా!

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి దెబ్బ‌కు కూట‌మి ప్ర‌భుత్వం దిగొచ్చింది.

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి దెబ్బ‌కు కూట‌మి ప్ర‌భుత్వం దిగొచ్చింది. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో అల్ట్రాటెక్ సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల్లో పనుల్ని త‌న వాళ్ల‌కు ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో ఏకంగా ఉత్ప‌త్తినే అడ్డుకున్నార‌ని ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌లే క‌థ‌నాలు రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డిపై ప్ర‌భుత్వం సీరియ‌స్ అవుతుంద‌ని కొంద‌రు అనుకున్నారు.

అబ్బే, అలాంటిదేమీ లేదు. త‌న‌పై వ‌చ్చిన క‌థ‌నాల వెనుక కుట్ర వుంద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి మీడియా ప్ర‌తినిధుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లు కేటాయించిన దాని కంటే, అద‌నంగా ప్ర‌భుత్వ భూమిని కూడా ఆక్ర‌మించాయ‌ని క‌లెక్ట‌ర్‌కు ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డం లేద‌ని, దీంతో రైతులు ప‌రిశ్ర‌మ‌ల స‌మీపంలో పంట‌లు పండించుకోలేక‌పోతున్నార‌ని ఆయ‌న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేప‌థ్యంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు ఆర్డీవో చిల‌మ‌కూరు సిమెంట్ ప‌రిశ్ర‌మ ఆక్ర‌మ‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అది కూడా బీజేపీ నాయ‌కుల్ని మాత్ర‌మే వెంట‌బెట్టుకుని విచార‌ణ జ‌రిపారు. మీడియా ప్ర‌తినిధుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా, ఆర్డీవో త‌న ప‌ని తాను చేసుకెళ్ల‌డంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికారులు ఎవ‌రికి ఒత్తాసు ప‌లుకుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అందుకే ప‌రిశ్ర‌మ‌ల భూఆక్ర‌మ‌ణ‌ల‌పై ఆర్డీవో విచార‌ణ‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే తీవ్ర ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో, ఆర్డీవో నివేదిక నిష్ప‌క్ష‌పాతంగా ఏ మేర‌కు వుంటుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. దేవునికైనా దెబ్బే గురువు అనే సామెత చందంగా, ఆదినారాయ‌ణ‌రెడ్డి దెబ్బ‌తో ప్ర‌భుత్వం ఆయ‌న ఫిర్యాదుపై వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టింద‌నే మాట వినిపిస్తోంది.

5 Replies to “ఎమ్మెల్యే ఆది దెబ్బా.. మ‌జాకా!”

  1. జగన్ ఏమో జిందాల్ ని, దాల్మియాలని, టాటా లని, గోయెంకా లని, బిర్లా వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఇక్కడ కంపెనీలు పెట్టేటట్టు చేస్తాడు…

    .

    వీళ్ళేమో…

    .

    ఫేక్ కేసు పెట్టి జిందాల్ ని గెంటేసారు…

    .

    కంపెనీ లో వాటాలు ఇవ్వకపోతే…. తెరవనిచ్చేది లేదు అని మూయిస్తారు…

    .

    చెప్పినట్టు వినకపోతే … కంపెనీ లో agitation తెప్పించి లే ఆఫ్ చేయిస్తారు…

    .

    కంపెనీ లో అన్ని కాంట్రాక్టు లు ఇవ్వకపోతే మెటీరియల్ బయటికి వెళ్ళేది లేదు అని బెదిరిస్తారు…

    .

    గత అయిదేళ్లలో ఇలాంటి ఘటన ఒక్కటైనా జరిగిందా.. ?

    .

    విధ్వంసం అంటే ఇదే.. అర్ధం అవుతుందో లేదో.. ?

    1. అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తీసుకుని వచ్చిన కియా పరిశ్రమ మర్చిపోయారు 

  2. ఈ ఆర్టికల్ రాసింది ఎవరోగానీ.. అన్వయ దోషాలు చాలా ఉన్నాయి. సరి చేసుకోండి

Comments are closed.