మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. అయ్యన్నకు ఇష్టమైన బూతుల భాషలోనే ఆయన ప్రత్యర్థి అయిన ఉమాశంకర్ తిట్టారు. ఇక మీదట తమ పార్టీ నేతలు, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బూతులు మాట్లాడితే… అదే భాషలో అయ్యన్నతో పాటు చంద్రబాబు, లోకేశ్‌లను కూడా తిడుతామని ఆయన హెచ్చరించడం గమనార్హం.
ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ అయ్యన్నపై విరుచుకుపడ్డారు. సైకో అయ్యన్నపాత్రుడు, తుగ్లక్ అయ్యన్నపాత్రుడు, శాడిస్ట్ అయ్యన్నపాత్రుడు ఒళ్లు బలిచి కొట్టుకుంటున్నాడన్నారు. తన స్థాయికి మించి అయ్యన్న మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఏరా అయ్యన్నపాత్రుడు మాకు బూతులు రావా? అని ప్రశ్నించారు. నువ్వు బూతులు మాట్లాడ్తావు కదా అని నిలదీశారు. అయ్యన్నపాత్రుడి గురించి ఎవరికి తెలియదు? అయ్యన్నపాత్రుడు ఒక దొంగ, చెత్త నా కొ…అని తిట్టారు. అయ్యన్న ఒక పెద్ద పోరంబోకు అని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు ఎంత వెదవో అతనికే తెలియనంతగా రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.
తమ పార్టీ నాయకుల్ని సైకోలని అయ్యన్నపాత్రుడు విమర్శిస్తున్నారన్నారు. ఎవర్రా సైకో? నువ్వు రా సైకో, మీ నాయకుడు చంద్రబాబునాయుడు సైకో, మీ లోకేశ్ సైకో అని ఫైర్ అయ్యారు. నువ్వొక పెద్ద శాడిస్ట్ అని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో తుగ్లక్‌లు ఎవరంటే… అయ్యన్న, చంద్రబాబు, నారా లోకేశ్‌లే అని ప్రతి ఒక్కరూ చెబుతారన్నారు. టీడీపీ హయాంలో వందల కోట్లు సంపాదించిన అయ్యన్నపాత్రుడికి అధికారం పోవడంతో మతిభ్రమించి, మందు ఎక్కువై మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.
ఇటీవల సీఎం జగన్ నర్సీపట్నానికి వస్తుంటే…అడ్డుకుంటానని అయ్యన్న హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజే తాను అయ్యన్నపాత్రుడికి చెప్పానని…. ఒరేయ్ అయ్యన్నపాత్రుడు నీకు దమ్ముంటే, మగాడివైతే అడ్డుకోరా, అక్కడే నిన్ను పాతేస్తా అని హెచ్చరించానన్నారు. ఆ రోజు ఎక్కడ పోయావురా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగ అయ్యన్న కాదా? అని ఆయన నిలదీశారు. తమ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడ్డం మానుకోకపోతే, తాము అంతకు రెట్టింపు బూతులు తిట్టాల్సి వస్తుందని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ హెచ్చరించారు.