పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న… రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయా అనే బాధ లోపల పెట్టుకొని ఎక్కడ మైక్ కనపడిన తన సామాజిక వర్గానికి చెందిన ఇతర పార్టీల నాయకులను తిడుతూ ప్రసంగాలు చేస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇటీవల ఓ సభలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై కూడా అదే స్థాయిలో విమర్శించడంపై ఇవాళ ముద్రగడ పవన్‌ను ఉద్దేశిస్తూ లేఖ రాశారు.
నిజాన్ని నిర్భయంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే తాను లేఖ రాస్తున్నానన్న అంటూ.. తాను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదని, యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదని పవన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమమూ చేయలేదని చురకలంటించారు. నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి, యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరెందుకు అందించలేదు? అని ప్రశ్నించారు. వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయయని.. మీరు మాట్లాడే భాష వల్ల నష్టమే తప్ప లాభం లేదన్నారు.
ఇప్పటివరకు ఎంత మందిని చెప్పుతో కొట్టారో, గుండ్లు గీయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపుల ఉద్యమానికి సహాయం చేసిన వారిని విమర్శించడం తప్పు అని హితవు పలికారు. కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదని పవన్‌ని నిలదీశారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండని అడగాలని.. కలిసి పోటీ చేస్తున్నప్పుడు సీఎంని చేయమని అడగడం హాస్యాస్పదం అని దుయ్యబట్టారు.
రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిదని వైఎస్ జగన్ చెప్పినప్పుడు.. తానిచ్చిన సమాధానమేంటో అడిగి తెలుసుకోవాలన్నారు. మొత్తానికి మైక్ కనపడితే చాలు కులాల పేర్లు చదువుతూ.. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగోట్టలానే చూసే పవన్‌కు లేఖ ద్వారా ముద్రగడ మంచిగానే గడ్డి పెట్టారు. పవన్ ఇప్పటికైనా కులాల పేర్లు ఎత్తుకుండా ప్రసంగాలు చేస్తారనేది చూడాలి.