ఆ నాయకులు అంత అంటరానివారా పవన్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విచిత్ర మనిషి. దాదాపు 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న(ప్ర‌జారాజ్యంతో క‌లిపి) కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెల‌వాలేక‌పోతున్నా అనే విష‌యం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనికి ప్ర‌జ‌ల…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విచిత్ర మనిషి. దాదాపు 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న(ప్ర‌జారాజ్యంతో క‌లిపి) కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెల‌వాలేక‌పోతున్నా అనే విష‌యం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనికి ప్ర‌జ‌ల నుండి వ‌చ్చే ఒక్కే ఒక స‌మాధానం నిల‌క‌డ‌లేని మాట‌లు, రాజ‌కీయాల్లో కూడా సినిమాల్లో లాగా 3 గంట‌ల్లో వార్డు మెంబ‌ర్ నుండి సీఎం అయ్యే ఆవ‌కాశం ఉంద‌ని భావించ‌డం. మ‌రి ముఖ్యంగా త‌న పార్టీలోని ఇతర నాయ‌కుల‌కు క‌నీసం మ‌ర్యాద కూడా ఇవ్వ‌క‌పోవ‌డం.

సంవత్సరం కిందట ఎంతో ముచ్చటపడి ఓ బస్సును తయారు చేసుకుని పెద్ద హడావుడి చేసి తీరా లోకేష్ పాదయాత్ర ఉందని బస్సు యాత్రను వాయిదా వేసుకుంటూ వచ్చిన ప‌వ‌న్.. గ‌త‌ వారంలో బస్సును బయటకు తీసి గోదావరి జిల్లాలో చీకటి పడిన తర్వాత ఆ బస్సును స్టేజ్ లాగా వాడుకొని వైసీపీ నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటూ ప్రసంగాలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ స్టేజ్ పైన పవన్ తప్ప ఏ ఇతర జ‌న‌సేన‌ నాయకుడు కూడా కనపడట్లేదు. క‌నీసం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఇన్ని రోజులు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ఒక నాయ‌కుడిని కూడా ఆ బ‌స్సుపైనా త‌న‌తో పాటు క‌నీసం నిల్చునే ఆవ‌కాశం లేదంటే ప‌వ‌న్ మ‌న‌సులో వారి స్థానం ఏంటో ఆర్ధం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఆ బస్సు పైన తాను మాత్రమే మాట్లాడాలని అనుకున్నారో లేక పార్టీలోని ఇత‌ర‌ నాయకులు తనతోపాటు నిలుచునే అంత‌వారు కాద‌ని భావించారో తెలియడం లేదు. అలాగే ప‌గ‌లు ఏర్పాటు చేసే స‌మావేశల్లో కూడా ప‌వ‌న్, నాదెంళ్ల మ‌నోహార్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు లేదా ముగ్గురు మాత్ర‌మే ముఖ్యంగా క‌నిపిస్తున్నారు. క‌నీసం ఆ నియోజ‌వ‌ర్గాల్లోని నాయ‌కుల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తేనే కదా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు గెలిచి ఎమ్మెల్యేలు అయి.. తన‌ను సీఎం చేసేది. వేల పుస్త‌కాలు చ‌దివిన ప‌వ‌న్‌కు సీఎం కావాలంటే ఎమ్మెల్యేలు అవ‌స‌రం అనేది తెలియ‌ద‌నుకోవ‌డం చూసే వారి అవివేకం.

గతంలో కూడా చాల మీడియా సమావేశాల‌ల్లో ప‌వ‌న్ మాట్లాడుతూ తాను జాతీయ స్థాయి నాయకుడు అని చెప్పుకున్నారు. బిజెపిలోని రాష్ట్ర నాయకులతో కంటే తాను జాతీయ నాయకులతోనే ఎక్కువ ప‌రిచ‌య‌లు ఉన్నాయ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. మ‌రి అలాంటి స్థాయి నాయ‌కుడు ప‌క్క‌న నిల్చునే అర్హత బ‌హుశా మిగత జ‌న‌సేన నాయ‌కులు లేక‌పోవ‌చ్చానంటున్నారు ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు.  

40ఏళ్ల‌ రాజ‌కీయం అనుభ‌వం, 14 ఏళ్ల సీఎంగా ప‌ని చేసిన చంద్ర‌బాబు అయిన‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ అయినా.. వారు ఎక్క‌డా మీటింగ్‌లు పాల్గొన్న వారితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు క‌నిపించేవారు. కానీ రెండు చోట్ల ఓడిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీటింగ్‌ల‌ల్లో మాత్రం ఆ పార్టీ నాయ‌కులు త‌న‌తో పాటు పెద్ద‌గా క‌న‌ప‌డ‌క‌పోవ‌డం కాస్తా వింత‌గానే ఉంది.