దసరా పర్వదినాన మెగాస్టార్ సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. అదేంటంటే…
“Just asking…?ప్రభుత్వ ఆధీనంలో ఉండే temples యొక్క ఆదాయం Endowments department వెల్తే…మరి ఈ ప్రైవేట్ గుడి యొక్కఆదాయం ఎవరికి వెల్తుంది.. Let me know your answers” అని ఆయన ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
మెగా బ్రదర్స్ పవన్‌కల్యాణ్, నాగబాబు అయోమయ మనస్తత్వాల్ని ఈ ట్వీట్ ప్రతిబింబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగబాబు తాను ఏది అడగదలుచుకున్నారో, దాన్నే నేరుగా ప్రశ్నించి వుంటే ఈ గందరగోళం వుండేది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
పండుగ రోజు ఈ ప్రశ్న వేయడం వెనుక నాగబాబు ఉద్దేశం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అసలు ఈ ట్వీట్ ఏంటో నాగబాబుకైనా అర్థమవుతోందా? … Just asking?అంటూ సోషల్ మీడియాలో ఆయన్ను నెటిజన్లు ర్యాగింగ్ చేయడం గమనార్హం. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేట్ గుడుల ఆదాయంపై అడుతున్నారో చెబితే… తప్పక సమాధానం వస్తుందని అంటున్నారు.
ప్రైవేట్ దేవాలయాల నిర్మాణాలను సామూహికంగా చేపడుతుంటారు. పూజాది కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు ప్రజలంతా కలిసి చందాలు వేసుకుంటుంటారు. ప్రధానంగా ప్రైవేట్ ఆలయాలను ఆదాయ వనరుగా చూడరనే సంగతి నాగబాబుకు తెలియకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేయాలనేది నెటిజన్ల అభిప్రాయం.