ఉత్తరాంధ్రా టూర్ వేశారు చినబాబు. ఆయన ఒక వివాహ కార్యక్రమం నిమిత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. ఇక రాజాంలో లోకేష్ మాజీ టీడీపీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకటరావు నివాశంలో చాలా సేపు గడిపారు.
అక్కడికే జిల్లా పార్టీ నాయకులను పిలిపించుకుని వారితో మాట్లాడారు, అలాగే పార్టీ నాయకులతో ముచ్చట్లు పెట్టారు. మరో వైపు ఎన్నికలకు సిద్ధం కండి అని పార్టీ నాయకలు పిలుపు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది అనుకున్నా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు ఏరీ అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది. లోకేష్ బాబు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అందునా భావి ముఖ్యమంత్రి ట్యాగ్ ఉండనే ఉంది.
మరి అంతటి నేత వస్తే ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు ఆయన వెంట ఉండడకపోవడం విశేషమే అంటున్నారు. పైగా కళా వెంకటరావు ఇంట్లో మీటింగ్ పెట్టారు లోకేష్. అంటే ఏపీ టీడీపీకి ఇంకా కళానేనా ప్రెసిడెంట్ అన్న సందేహమూ కలుగుతోంది అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఆ మధ్యన తిరుపతిలోని ఒక హొటల్ లో అచ్చెన్నాయుడు పార్టీ లేదు ఏమీ లేదు అంటూ మాట్లాడుతూ లోకేష్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. నాటి నుంచే అచ్చెన్నాయుడుతో లోకేష్ ఎడం పాటిస్తున్నారు అన్న ప్రచారం సాగింది.
ఇపుడు స్వయనా లోకేష్ శ్రీకాకుళం వచ్చినా ఆ జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు లోకేష్ వెంట కనిపించకపోవడంతో ఈ గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతోందా అన్న డౌట్లు అయితే అందరిలో వస్తున్నాయి. మొత్తానికి లోకేష్ టూర్ లో అచ్చెన్న కనిపించకపొవడమే హాట్ టాపిక్ గా ఉందిపుడు.