సీట్లు గెల‌వ‌కుండానే ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్ర‌య‌త్నం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ మారుపేరు. జ‌మ్ము కాశ్మీర్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుపై మ‌రోసారి ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌మ్ముకాశ్మీర్‌లో దొడ్డిదారిలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు…

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ మారుపేరు. జ‌మ్ము కాశ్మీర్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుపై మ‌రోసారి ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌మ్ముకాశ్మీర్‌లో దొడ్డిదారిలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఐదుగురు ఎమ్మెల్యేల‌ను నామినేటెడ్ చేసింద‌న్నారు. రేపు ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో సీట్లు గెల‌వ‌కుండానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి బీజేపీ త‌న ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసింద‌ని ఆయ‌న ఆరోపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

నిజంగా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు వుంటే బీజేపీ ఎందుకు ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆయ‌న నిల‌దీశారు. ప్ర‌ధాని మోడీ కేవ‌లం విదేశాల్లో మాత్ర‌మే ప‌ర్య‌టిస్తార‌న్నారు. బీహార్‌, మణిపూర్‌ల‌లో మాత్రం ఆయ‌న ఎందుకు ప‌ర్య‌టించ‌ర‌ని సీపీఐ నాయ‌కుడు నారాయ‌ణ ప్ర‌శ్నించారు. బీహార్‌లో వ‌ర‌ద‌ల‌ను జాతీయ విప‌త్తుగా త‌క్ష‌ణం ప్ర‌క‌టించాల‌ని నారాయ‌ణ డిమాండ్ చేశారు. ప్ర‌ధాని ఘోరంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

న‌క్స‌లిజం పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స‌మావేశాలు నిర్వ‌హించ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. దేశంలో అత్యాచారాలు, హ‌త్య‌లపై దృష్టి సారించాల‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు. మారిన ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు మావోయిస్టులు త‌మ పంథా మార్చుకుని, జ‌నంతో క‌లిసి పోరాటాలు చేయాల‌ని ఆయ‌న సూచించారు.

ఘోరాలు చేసిన డేరా బాబాకు బెయిల్ ఇచ్చేలా చేశార‌ని కేంద్రంపై విమ‌ర్శ‌లు చేశారు. కానీ విప్ల‌వ క‌వి వ‌ర‌వ‌ర‌రావుకు మాత్రం బెయిల్ రాలేద‌న్నారు. ముంబ‌య్‌లోనే వ‌ర‌వ‌ర‌రావు ఉండాల్సి వ‌చ్చింద‌న్నారు.

9 Replies to “సీట్లు గెల‌వ‌కుండానే ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్ర‌య‌త్నం”

  1. వీడికి మీకు వేరే టాపిక్ దొరకలేదేమో, POK నుంచి వచ్చిన శరణార్థులకి కాశ్మిర్ పండిట్ ల కోసం అవి నామినేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాకపోతే ఇక్కడ అంగ్లో ఇండియన్స్ కోసం చేసేవి కూడా కరెక్ట్ కాదు!

    1. ఆంగ్లో ఇండియన్ కి నామినేట్ చెయ్యడం ఆపేశారు.. నీ బత్తాయి కబుర్లు ఇంకెక్కడికిన వెళ్లి చెప్పు..

Comments are closed.