లిక్కర్ లో ‘పచ్చ గండి’: సర్వత్రా సిండికేట్ల మయం!

కొత్త మద్యం విధానం తీసుకువస్తున్నానంటూ దోపిడీకి పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు.

తెలుగుదేశం నాయకులు ప్రతిచోటా కుమ్మక్కు అవుతుండడంతో ఊరూరా లిక్కర్ సిండికేట్లు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరచుకోవడానికి దరఖాస్తులకు మరో మూడు రోజుల్లో గడువు ముగియనుంది. అయినప్పటికీ షాపులకోసం దరఖాస్తులు మందకొడిగా సాగుతున్నాయి.

కొన్ని చోట్ల షాపుల సంఖ్య కంటె తక్కువగా దరఖాస్తులు ఇప్పటి దాకా వచ్చాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా లెక్కకు మిక్కిలిగా దరఖాస్తులు వచ్చేస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు. ఎక్కడికక్కడ పెద్దస్థాయిలో సిండికేట్లుగా ఏర్పడినట్లు, అందరూ కలిసి ఒకటే దరఖాస్తు వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో.. లిక్కరు ద్వారా రాగల ఆదాయానికి పైసా కూడా గండిపడకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లిక్కరు షాపులను నిర్వహించారు. షాపు నిర్వహణకు చదువుకున్న యువకులకు కాంట్రాక్టు ఉద్యోగులుగా అవకాశం కల్పించారు కూడా. తద్వారా పలువురికి ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. లిక్కరు ద్వారా వచ్చే ప్రతిపైసా ఆదాయం ప్రభుత్వ ఖజానాకే చేరింది.

అయితే చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత.. లిక్కరు వ్యాపారం గురించి రకరకాల కల్లబొల్లి కబుర్లు చెప్పారు. జగన్ సర్కారు దోచుకున్నది అని చెప్పారు. అంతా పారదర్శకంగా షాపులు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుండగా.. ఏ రకంగా దోచుకున్నారనే క్లారిటీ మాత్రం ఆయన ఇవ్వలేదు. కొత్త మద్యం విధానం తీసుకువస్తున్నానంటూ దోపిడీకి పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. తిరిగి ప్రెవేటు వ్యక్తుల చేతుల్లోనే దుకాణాలు పెట్టేయాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుల్ని మాత్రం నిర్ణయించారు.

కంటితుడుపు చర్యగా ప్రభుత్వం మరో పని కూడా చేసింది. లిక్కరు దుకాణాలకు దరఖాస్తు చేసే విషయంలో వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇది కేవలం నామమాత్రపు చర్య. ఆచరణలో సాధ్యం కాదనేది అందరికీ తెలుసు.

తెలుగుదేశం పార్టీ నాయకుల దందా కొనసాగేలాగా.. తెదేపా నాయకులందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి లిక్కరు వ్యాపారంలో లాభాలను పంచుకునేలాగా వారికి దోచిపెట్టడానికే ఇలా చేశారన్నది స్పష్టం. దానికి తగ్గట్టుగానే దరఖాస్తులు కూడా అత్యల్పంగా వస్తున్నాయి. ప్రభుత్వం గతిలేక దరఖాస్తు చేసిన వారందరికీ దుకాణాలు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

19 Replies to “లిక్కర్ లో ‘పచ్చ గండి’: సర్వత్రా సిండికేట్ల మయం!”

    1. gov will loose the money in the form of application fee . Telanagana gov earned 2000 cr in applications itself . by doing syndicate TDP leaders will go for default price so gov will loose bidding price based on demand .

    2. for namesake. Applications for liquor shops….already decided. it’s already on cards. Who is winner then no use of game rules…… your way of thinking is irrational….

  1. ఇంకా వెలం మొదలు కూడా కాలెదు వీదు అప్పుడె సిండికెట్ అని మొరుగుతున్నాడు! పొని అదె నిజం అయితె, నువ్వు, నీ YCP వేలం లొ పాల్గొని డబ్బు చెసుకొ!

  2. ఇంకా వెలం మొదలు కూడా కాలెదు వీదు అప్పుడె సిండికెట్ అని మొరుగుతున్నాడు!

  3. పచ్చ ల0జ కొ!డు!కు!లు వ్యాపారస్తుల మీద పడ్డారు…కష్టపడి సామాన్యులు నిర్మించుకున్న వ్యాపార డిస్ట్రిబ్యూషన్లని ఎమ్మెల్యేల అండతో బెదిరించి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా కైవసం చేసుకుంటున్నారు. చేతకాని పచ్చ ఎమ్మెల్యేలు ఏమి చెయ్యలేక…పచ్చ ల0జ కొ!డు!కులకి షాడో అధికారం ఇచ్చేసారు. దాని పర్యవసానం చిన్న వ్యాపారులని, డిస్టరుబుటర్లని, రెస్టారెంట్ ఓనర్లని బెదిరించి వాళ్ళ వ్యాపారాలని, కుటుంబాలని నాశనం చేస్తున్నారు.

    బీజేపీ ముసుగులో కూటమికి మద్దత్తు ఇచ్చిన వ్యాపార (వైశ్య) వర్గాలకి ఇలా జరగాల్సిందేనా?

    మన కష్టాన్ని వారికీ ధారాదత్తం చేయాల్సిందేనా?

    1. Mundamopi solluganti, karyakarthalu dabbulu gaalilonundi tesukuraaru. Vallaku sampayinchukne margalundaali, anni tane tinalani nayakudu hiest level lo antha nakeste ground level karyakarthalu yemi cheyyali? Nayakudini road meedaku lagali ade chesaaru ycp karya karthalu kudaa vote veyyaledu.

Comments are closed.