స‌నాత‌న సేనానిగా ప‌వ‌న్‌.. జ‌గ‌న్‌కు లాభ‌మా? న‌ష్ట‌మా?

స‌నాత‌న సేనానిగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త అవ‌తారం ఎత్తారు. స‌నాత‌న ధ‌ర్మానికి తానే చాంపియ‌న్‌గా నిలిచి, రాజ‌కీయంగా హిందువుల ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌ని ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త రాజ‌కీయ పంథాపై…

స‌నాత‌న సేనానిగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త అవ‌తారం ఎత్తారు. స‌నాత‌న ధ‌ర్మానికి తానే చాంపియ‌న్‌గా నిలిచి, రాజ‌కీయంగా హిందువుల ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌ని ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త రాజ‌కీయ పంథాపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌వ‌న్ నెత్తికెత్తుకోవ‌డం వ‌ల్ల ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త పంథా వ‌ల్ల వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఎంత మాత్రం న‌ష్టం లేద‌నేది మెజార్టీ అభిప్రాయం. ఎందుకంటే స‌నాత‌న ధ‌ర్మం అంటూ రెచ్చిపోతున్న ప‌వ‌న్ నైతిక‌త అంశం ప్ర‌ధానంగా స‌మ‌స్య అవుతోంది. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంలో వైవాహిక జీవితం స‌క్ర‌మంగా సాగ‌లేదు. మూడేసి పెళ్లిళ్లు, అలాగే పంజాబ్‌కు చెందిన హీరోయిన్‌ను మోస‌గించార‌నే ఆరోప‌ణ‌లు స‌రేస‌రి. దీంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా స‌నాత‌న ధ‌ర్మం గురించి మాట్లాడితే బాగోద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

శ్రీ‌రామ చంద్రుడి గురించి గొప్ప‌గా మాట్లాడే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ మ‌హ‌నీయుడి నుంచి ఎలాంటి ఆద‌ర్శాలు తీసుకున్నారు? పాటిస్తున్నారు? అనే ప్ర‌శ్న ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎదుర‌వుతోంది. దీనికి ప‌వ‌న్‌తో పాటు జ‌న‌సేన నాయ‌కుల వ‌ద్ద ఎలాంటి స‌మాధానం లేదు. ఎందుకంటే ప‌వ‌న్ శ్రీ‌రామ చంద్రుడి ఆద‌ర్శాల‌కు పూర్తి వ్య‌తిరేక‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఇదే ఆయ‌న‌కు అడ్డంకిగా మారింది.

అందుకే స‌నాత‌న ధ‌ర్మం పేరుతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్ని ర‌కాల గెంతులేసినా, జ‌గ‌న్‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని అంటున్నారు. మ‌హా అయితే త‌న మాట‌ల‌తో, వేష‌ధార‌ణ‌తో బీజేపీని రంజింప చేయొచ్చేమో కానీ, జ‌గ‌న్‌ను దెబ్బ‌తీయ‌డం సాధ్యం కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతోఇంతో టీడీపీకి మైనార్టీల‌ను, ద‌ళితుల్ని ప‌వ‌న్ దూరం చేసే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని అంటున్నారు.

25 Replies to “స‌నాత‌న సేనానిగా ప‌వ‌న్‌.. జ‌గ‌న్‌కు లాభ‌మా? న‌ష్ట‌మా?”

  1. ఇకనేం, ఇక మీ వైసీపీ మీడియా లో పవన్కళ్యాణ్ గురించి ఎక్కువ ప్రచారం చెయ్యండి, ఎందుకంటే వైసీపీ కి లాభం, టీడీపీ కి నష్టం కదా!

  2. If you really think there will not be any damage to ysjagan, you wouldn’t have written this article.

    Some serious damage is definitely going to happen to YCP.

    Also, marriages are not related to Sanathan Dharma. Better get knowledge about that first and then try to defame PK

  3. ఇటు వైపు వారు కొందరు అటు వెళతారు.. అటు వైపు వారు ఇంకా ఎక్కువ మంది ఇటు వస్తారు…

  4. క్రికేట్ ఆడుకోమని 11 ఇచ్చారు… అయినా ఇంకా మారలేదు…. మారరు కూడా…. వచ్చే ఎన్నికల్లో. ష టీల్ టీం ఇస్తారు…. లే…. ష టీల్ అడుకోవడమే..

      1. వాళ్ళు సింగల్ గ పోటీ చెయ్యలేదు కదా మీరు పోటీ చేయడం మానేయండి…ఐన ప్రజలు పోత్తు ని accept చేసాక మీకు ఏంటి ఇబ్బంది….

    1. ఆరవ తేదీన ఆంధ్ర జ్యోతి పేపర్ లో ఇసుక దందా చేస్తున్న.. కూటమి ప్రభుత్వం.. ఆర్టికల్ చదవండి మీకే తెలుస్తుంది

  5. Jagan is irrelevant to the whole issue as well as politics. Pawan always raises an issue independent of any thing as along as he feels is relevant for living. All the uneducated journalists who are unemployed need to react. In way, Pawan provided employment to them by bringing up an issue that no politician dare to take up

  6. పావలా క్యాబేజి ఇస్తే తైతక్కలాడే పావలా క్లౌన్ గాడి మీద తమిళ్ నాడు లో బోలెడు కేసులు వస్తున్నాయి. మరి వాటికి సమంధనం చెప్పాలని వీడు అనుసరించే వక్ర ధర్మం చెప్పలేదా….

    అసలు సనాతన ధర్మం అనే పేరునే ఉచ్చరించడానికి మె-గే ఫ్యామిలిలో ఎవడు కూడా సరిపోడు….దేవుడిని నమ్మని అహకారం వాళ్ళకి డబ్బువలన, ఇప్పుడు అధికారం వలన వచ్చింది. దీపారాధన లో సిగరెట్ వెలిగించినోడికి పుట్టిన నేత సంతతి వీళ్లు. ఇప్పుడు ధర్మం పేరుతో ప్రజలని దోచుకోవడానికి వస్తున్నారు….జన సన్నాసులారా..మేలుకోండి!

  7. గుర్తుందా కొన్ని నెలలు క్రితం ఇలానే ఏమి జరిగిన అన్న కె లాభం మిగతా వాళ్ళకి నష్టం అన్న ఏం చేసిన అదో వ్యూహం అద్భుతం అన్నట్టు ప్రాజెక్ట్ చేసావ్ …ఇప్పుడు ఏమైంది ఆఖరుకి ప్రతిపక్షం హోదా కూడా దక్క లేదు..

  8. జగన్ గా డి కొత్త పేరు బంకర్ బాబు అంట .. ఎలెవన్ రె డ్డి – బంకర్ బాబు ఈ రెండిటిలో ఏది బాగుంటది కింద కామెంట్ లో తెలియచేయండి బ్రో ..

  9. ఇలాగే రాయి .. 2019 నుంచి బిజ్జల గాడు మా ఓట్లు వేరే ఉన్నాయి అని మబ్బులు బెట్టి ఊరించారు 11 వచ్చే సరికి కళ్ళు తేలేసాడు .. 2029 లో ఆ 11 లోనుంచి 1 లేపేసేవరకు మీరు నిద్ర పోయేటట్లు లేరు .

Comments are closed.