సిపిఐ నారాయణకు గట్టి షాక్ తగిలింది. ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మీద నోరు పారేసుకున్నందుకు మెగా ఫ్యాన్స్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తం అయింది.
సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఓ లెక్కలో ఆడేసుకున్నారు. అది అలా వుంటే వరద బాధితులను పరామర్శించడానికి గోదావరి జిల్లాలకు వెళ్లిన నారాయణ కు అక్కడి మెగాభిమానులు, జనసేన కార్యక్తర్తల నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురైంది.
జనాలు చాలా పరుష పదజాలంతో నారాయణ మీద జనం విరుచుకుపడ్డారు. రాయలేని భాషలో తిట్లు లంకించుకున్నారు. తమకు సమాధానం చెప్పి వెనక్కు వెళ్లాలని డిమాండ్ చేసారు. మొత్తం మీద ఇలా వ్యతిరేకత రావడంతో నారాయణ ఓ క్షమాపణ విడియో వదిలారు.
గమ్మత్తేమిటంటే తాను చిరంజీవిని చిల్లర బేరగాడు అని అనడం భాషాదోషం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా అన్నందుకు మెగాభిమానులు, కాపునాడు మహానుభావులు తనను క్షమించాలని కోరారు.
దీన్ని కూడా కొంత మంది మెగాభిమానులు తప్పు పడుతున్నారు. కాపునాడు మహానుభావులు అంటూ చిరంజీవిని ఓ కాస్ట్ కు పరిమితం చేసే ప్రయత్నం చేసినట్లు వారు ఫీలవుతున్నారు. మొత్తం మీద కమ్మ..కాపు కలిపి రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటుంటే నారాయణ లాంటి వారి వల్ల కమ్మ..కాపుల మధ్య ఎడం మరింత పెరుగుతున్నట్లుంది.