మంత్రి నారాయ‌ణ‌కు కోటంరెడ్డి ఝ‌ల‌క్‌!

నారాయ‌ణ‌తో తీవ్ర విభేదాల వ‌ల్లే ఆయ‌న్ను త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌నివ్వ‌కూడ‌ద‌నే త‌లంపుతో శ్రీ‌ధ‌ర్‌రెడ్డి త‌న మార్క్ రాజ‌కీయానికి తెర‌లేపార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, మంత్రి నారాయ‌ణ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విభేదాలున్నాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి చొర‌బ‌డుతున్నార‌నేది కోటంరెడ్డి ప్ర‌ధాన ఆరోప‌ణ‌. నెల్లూరు సిటీ నుంచి నారాయ‌ణ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇద్ద‌రూ ఒకే పార్టీ. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో కోటంరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవ‌డంలో నారాయ‌ణ కీల‌కంగా ప‌ని చేశారు. అయితే రాజ‌కీయ ఆధిప‌త్యం వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి, నారాయ‌ణ ప‌న్నాగాల‌ను ప‌డ‌నివ్వ‌న‌ని కోటంరెడ్డి అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో మంత్రి నారాయ‌ణ‌కు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఝ‌ల‌క్ ఇచ్చార‌నే చ‌ర్చ నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఇవాళ నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో, న‌గ‌ర కార్పొరేష‌న్ ప‌రిధి కూడా అయిన 26 డివిజ‌న్‌ల‌లో రూ.40 కోట్ల‌తో 105 అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్టు శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ ప‌నుల‌న్నీ ఒకేసారి ప్రారంభం అవుతాయ‌ని, వీటికి ప్ర‌జ‌లే అతిథుల‌ని కోటంరెడ్డి చెప్పారు.

మున్సిప‌ల్‌శాఖ మంత్రి కూడా అయిన నారాయ‌ణ‌తో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ శంకుస్థాప‌న చేయించుకూడ‌ద‌నే ఎత్తుగ‌డ‌లో భాగంగానే ప్ర‌జ‌ల‌ను ముఖ్య అతిథులంటూ తెర‌పైకి తెచ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల 17వ తేదీ లోపు మ‌రో 198 చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలో సీసీ రోడ్లు, క‌ల్వ‌ర్టులు, డ్రెయిన్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.

నారాయ‌ణ‌తో తీవ్ర విభేదాల వ‌ల్లే ఆయ‌న్ను త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌నివ్వ‌కూడ‌ద‌నే త‌లంపుతో శ్రీ‌ధ‌ర్‌రెడ్డి త‌న మార్క్ రాజ‌కీయానికి తెర‌లేపార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇద్ద‌రితో టీడీపీ అధిష్టానం ఇది వ‌ర‌కే చ‌ర్చించిన‌ప్ప‌టికీ, విభేదాలు మాత్రం తొల‌గిపోలేదు. మున్సిప‌ల్‌శాఖ‌కు సంబంధించిన ప‌నుల్ని పెద్ద ఎత్తున చేప‌డుతూ, అందుకు సంబంధించిన మంత్రి నారాయ‌ణ‌… స‌మీప నియోజ‌క వ‌ర్గ ఎమ్మెల్యే కూడా అయిన‌ప్ప‌టికీ, కోటంరెడ్డి ఏ మాత్రం ఖాత‌రు చేయ‌క‌పోవ‌డం విస్తృత చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే నారాయ‌ణ‌ను శంకుస్థాప‌న‌కు ఆహ్వానించ‌లేద‌నే ప్ర‌శ్న ఎదురు కాకుండా, ప్ర‌జ‌లే అతిథుల‌నే రాగాన్ని కోటంరెడ్డి ఎత్తుకోవ‌డం గ‌మ‌నార్హం.

8 Replies to “మంత్రి నారాయ‌ణ‌కు కోటంరెడ్డి ఝ‌ల‌క్‌!”

  1. రెండ్రోజుల క్రితం నాగబాబు MLC విషయం లో టీడీపీ జనసేన మధ్య ఏదో జరిగిపోయింది అని రాశావ్..కట్ చేస్తే లోకేష్ నాగబాబు కల్సి నామినేషన్ కి వచ్చారు.నారాయణ గారు వస్తే ఎం చేస్తావ్ రా?

  2. evadra ee gottam ye66i gaadu. narayana sir is like elephant. vellandirini tokkukuntoo vellipothadu. ekkuva chesthe kootami nunchi ilanti gottam gallani teesi nookadame.

  3. Ento mana GA edi raasinaa daaniki opposite gaa jarugutundi. Monna MLC elections lo Alapati will lose or atleast it will be very tough ani raasaadu. He won with great majority.Ninna Nagababu valla kootami lo vibhedaalu ani raasaadu. Cut cheste, both PK and Lokesh attended the nomination. 2024 elections lo anna will win ani raasaadu. Cut cheste he lost very badly. Ee website edo entertainment kosam chadavatam tappa information wise emi use ledu.

  4. Nice comment below

    రెండ్రోజుల క్రితం నాగబాబు MLC విషయం లో టీడీపీ జనసేన మధ్య ఏదో జరిగిపోయింది అని రాశావ్..కట్ చేస్తే లోకేష్ నాగబాబు కల్సి నామినేషన్ కి వచ్చారు.నారాయణ గారు వస్తే ఎం చేస్తావ్ రా?

Comments are closed.