లోకేష్ మాటల్లో లౌక్యం మరియు కాంట్రడిక్షన్లు!

నారా లోకేష్ తాను చాలా త్యాగాలు చేశానని చెప్పదలచుకున్నారో.. లేదా, తన గొప్ప చాటదలచుకున్నారో గానీ ఓ సంగతి సింక్ కావడం లేదు.

ఇండియా టుడే వారు ఢిల్లీలో నిర్వహించిన కాంక్లేవ్ లో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రాజకీయంగా మాత్రమే కాదు.. మాటతీరులో కూడా ఇదివరకటితో పోలిస్తే బాగా మెరుగుపడుతున్న నారా లోకేష్.. ఈ ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు చాలా లౌక్యంగా, చాతుర్యంగా సమాధానాలు చెప్పడం విశేషం. వాస్తవమే అయి ఉండాల్సిన రూలేం లేదు గానీ… తనను తాను గొప్పగా ప్రొజెక్టు చేసుకోవడానికి.. అనేక విషయాలు లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ.. ఆయన మాటల్లో కొన్ని కాంట్రడిక్షన్లు కూడా ఉన్నాయి.

తాను ఎప్పుడూ రోడ్డు లేని మార్గంలోనే నడిచానని లోకేష్ చెప్పుకోవడం అందంగా కనిపిస్తుంది గానీ వాస్తవం ఎలా అవుతుంది? ఎప్పుడూ తెలుగుదేశం గెలిచిన రికార్డులేని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని పోటీచేశానని చెప్పడం.. రోడ్డులేని మార్గంలో వెళ్లానని అనడానికి ఉపయోగపడవచ్చు. కానీ.. అదికాదు. ఆయనేమీ తెలుగుదేశం పార్టీని కాదని కొత్త పార్టీ స్థాపించి ఉంటే.. అది రోడ్డులేని మార్గం అవుతుంది. రాష్ట్రంలో బాగా బలంగా ఉంటే ఒక పార్టీకి కీలక నేతగా, అమరావతి పేరుతో ప్రజలందరూ ఒక వ్యామోహంలో మునిగిన ప్రాంతంలోని నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ‘రోడ్డులేని మార్గం’ ఎలా అవుతుంది? అనేది పలువురి ప్రశ్న.

నారా లోకేష్ తాను చాలా త్యాగాలు చేశానని చెప్పదలచుకున్నారో.. లేదా, తన గొప్ప చాటదలచుకున్నారో గానీ ఓ సంగతి సింక్ కావడం లేదు. అమెరికా కార్నెగీ మెలన్ లో అండర్ గ్రాడ్యుయేషన్, స్టాన్‌ఫర్డ్ లో ఎంబీయే చేసినప్పటికీ పాదయాత్రతోనే ఎంతో తెలుసుకోగలిగానని నారా లోకేష్ అంటున్నారు. పాదయాత్రతో తెలుసుకోవడం వరకు బాగానే ఉంది.. దానిని- స్టాన్‌ఫర్డ్ ఎంబీయేతో పోల్చడంలో అర్థంలేదుకదా అనేది ప్రజల అభిప్రాయం.

తెలుగు రాష్ట్రంలో ప్రజల బతుకులు ఎలా ఉంటాయో.. స్టాన్‌ఫర్డ్‌లో నేర్పరు కదా.. దానిని పోల్చుకుని పాదయాత్ర గురించి చెప్పుకోవడం ఎందుకు అనేది డౌటు. అలాగే.. ఆంధ్ర రాజకీయాల్లోకి రాదలచుకున్నప్పుడు.. ఆయన అండర్ గ్రాడ్యుయేషన్ కే అమెరికా పారిపోకుండా… ఇక్కడే ఉండి ఇక్కడి గవర్నమెంటు కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుకుని ఉంటే.. ఇక్కడి వ్యవస్థను, వ్యవహారాలను, ప్రజలను ఇంకా బాగా అర్థం చేసుకుని ఉండేవారు కదా అనేది పలువురి ప్రశ్న. ఆయన తండ్రి చంద్రబాబునాయుడు అలా చదువుకున్నారు కాబట్టే.. మంచి పాలకుడు అయ్యారు. లోకేష్ అలాగే చదివి ఉంటే.. తండ్రిని మించిన పాలకుడు అయ్యేవారు కదా అని పలువురు అంటున్నారు.

తాత తండ్రి ముఖ్యమంత్రులుగా చేసినా.. తనను తాను కేవలం తెదేపా కార్యకర్తగానే చూసుకుంటానని.. నాయకుడిని రాజకీయ వారసత్వాన్ని ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారని లోకేష్ చాలా చాతుర్యంతో సమాధానాలు చెబుతున్నారు. అదే సమయంలో తమ పార్టీ గెలిచిన తర్వాత.. ఎంతో కష్టమైన విద్యాశాఖను- ‘తను ఎంచుకున్నానని’ లోకేష్ చెప్పడం విశేషం. నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ మరియు ప్రభుత్వం మీద తన గుత్తాధిపత్యాన్ని, కర్ర పెత్తనాన్ని, అన్నింటికీ తానే కేంద్రబిందువుగా నడిపిస్తున్న వైనాన్ని దాచిపెట్టడానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రయత్నిస్తున్నట్టున్నది గానీ.. ఆయన మాటల్లోనే దొరికిపోతున్నారని కూడా ప్రజలు అనుకుంటున్నారు.

18 Replies to “లోకేష్ మాటల్లో లౌక్యం మరియు కాంట్రడిక్షన్లు!”

  1. లొకెష్ ఎంతొ బాగా మాట్లాడాడు అని అందరూ అంటుంటె… మరి నువ్వు మాత్రం కొడి గుడ్దు మీద ఈకలు పీకాలి కదా! మరి ఆలస్యం ఎందుకు పీకు!

  2. అరె చె. నా. కొ ఒకపక్కన చంద్రబాబు పాలన బాగోలేదనీ అరాచకం రాజ్యం ఏలుతుంది అనీ నువ్వే అంటావ్. లోకేష్ ఇండియా లో చదివి ఉంటే చంద్రబాబు ని మించి మంచి పాలన అందించే వీలు ఉండేది కదా అంటావ్. ఇంతకీ ఒకటే వ్యాసం లో రెండు విరుద్ధం అయిన స్టేట్మెంట్స్ నీదా తెలివితో లౌక్యంతో ఇంటర్వ్యూ ఎదుర్కొన్న లోకేష్ దా.

  3. ఒరేయ్ గూట్లే నువ్వు అన్నట్లు అమరావతి అనే వ్యామోహం కరెక్ట్ అనుకున్న అది 2019 ముందు.మూడు రాజధానులు అనే తుగ్లక్ నిర్ణయం తో అన్న దాన్ని చంపేశాడు.లోకేష్ అక్కడ 90 వేళ మెజారిటీ తో గెలిచింది అమరావతి మీద అస్సలు ఆశలు లేనప్పుడు.

  4. లోకేష్ అక్కడ90 వేళ మెజారిటీ తో గెలిచింది అమరావతి మీద అస్సలు ఆశలు లేనప్పుడు, అన్న మూడు రాజధానుల తల తిక్క నిర్ణయం తరువాత.

  5. ఒరేయ్ సన్నాసి…స్టాండ్ఫోర్డ్ లో చదివి పాదయాత్ర చేయడం ఎలా అనిపంచింది అని anchor రాజదీప్ పోలిక పెట్టాడు

  6. అంటే తమరి ఉద్దేశం, అమెరికా లో చదువు కోసం పోయినోళ్ళు అందరు పారిపోయినట్లేనా…అది కూడా స్టాండ్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీ లో చదవం పారిపోవడమా?పారిపోవడం అంటే చదువుకోరా అని అమెరికా పంపిస్తే కొంతమంది అక్కడ పేపర్ లీక్ సాధ్యం కాక backlogs క్లియర్ చెయ్యలేక తిరుగుటపా లో వచ్చారు చూడు అది

  7. నీకు ఇదే విధంగా అర్థం కావడం మా అందరి ఖర్మం.

    ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. రాష్ట్రం నాశనం అయినా నీకు కనబడదు

  8. MSS Koteswarao was continuously winning in Managalagiri on TDP Ticket. It is wrong to say that TDP never won Managalagiri seat. Please gain some GK and then write.

  9. మీ గురుణ్ణి ఇవే ప్రశ్నలువేస్తే AI అంటే అంతా (మన) ఇంటికే అనేవాడేమో

  10. For Instance…….

    It’s a lengthy question………

    Gober Gober………

    Vice….. Visss….. Viceeee…….

    Kalaakandaalu chala vunnaayi

    Avasaramaa manaki cheppu Guuuu…… A…

  11. నువ్వు అమెరికా లో కూర్చుని వెబ్సైటు ఎందుకు నడపడం వెంకట్రావు .. ఇండియా వోచేయే ..

Comments are closed.