తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి అంటే, సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎస్సీవీ నాయుడు, అలాగే జనసేన ఇన్‌చార్జ్ కోట వినుతకు అసలు గిట్టదు. జనసేన నేతల్ని, అలాగే ఎస్సీవీ నాయుడిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు.
ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలోని ఓటేరు చెరువును సొంత పార్టీకి చెందిన నేతలు ఆక్రమించి, సుమారు రూ.800-900 కోట్ల ఆస్తిని కొల్లగొడుతున్నారని, చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో బొజ్జల విన్నవించారు. ఎస్సీవీ నాయుడి గురించే బొజ్జల ఫిర్యాదు చేశారని అందరికీ తెలిసిందే. అందుకే ఎస్సీవీ నాయుడు మీడియా సమావేశం నిర్వహించి, బొజ్జలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొజ్జల దోపిడీ శ్రుతిమించిందని ఆయన ఆరోపించారు. ఇలాగైతే రోజూ అతని అరాచకాలపై మీడియా సమావేశంలో వివరిస్తానని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రోత్సాహంతో పోలీసులు తుక్కు సరఫరా చేసే లారీని అడ్డుకుని ఏడిపించడం, వ్యవహారం ఢిల్లీ, అటు నుంచి విజయవాడ, అక్కడి నుంచి అనంతపురం రేంజ్ డీఐజీకి చేరింది. ఈ వ్యవహారంలో రేణిగుంట రూరల్ సీఐ, గాజులమండ్యం ఎస్ఐ ఇరుక్కున్నారనే మాట వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా బొజ్జల అరాచకాల్ని నిరూపించడానికి మరోసారి అవకాశం దొరికిందని ఎస్సీవీ నాయుడు, జనసేన నేతలు ఎగిరి గంతేస్తున్నారు.
బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యవహార శైలితో టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సర్వనాశనం అవుతోందనే నాయుడి ఆరోపణలకు బలం చేకూరుతోంది. తుక్కు సరఫరా లారీ విషయంలో బొజ్జల రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని ఎస్సీవీ నాయుడు, జనసేన నేతలు భావించే పరిస్థితి. అయితే దీని వెనుక కూటమి నేతల ప్రమేయం వుందని బొజ్జల అనుమానిస్తున్నారని తెలిసింది. ఏది ఏమైనా శ్రీకాళహస్తి కూటమిలో లుకలుకలు… వాళ్ల అవినీతి బాగోతాలను బయట పెడుతోందన్నది వాస్తవం.
కంసాలి కంసాలి కొట్టుకుని బంగారం అసలు రేట్ బయట పెట్టారు అంట.. సరే ఇలా కొట్టుకుని ఇద్దరు ఒకరి బాగోతం ఇంకొకరు బయట పెట్టండి..
Which is good. It will help the people.
Super