చంద్రబాబునాయుడు ఎక్కువ మాట్లాడుతూ విమర్శలపాలవుతున్నారు. ప్రపంచాన్నే సృష్టించింది తానే అనడం తప్ప, మిగిలిన అన్ని విషయాలు ఆయన మాట్లాడేశారు. ఇక ఆయన్ను మోసే ఎల్లో మీడియా ఒక అడుగు ముందుకేసి …సృష్టికి ప్రతిసృష్టి చేసింది చంద్రబాబే అని, లోకానికి అందాన్ని తీసుకొచ్చిన ఘనత తమ ఆరాధ్య నాయకుడిదే అని ఆకాశమే హద్దుగా ప్రశంసలతో నిత్యం ముంచెత్తుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది తనతోనే ఆరంభమైందని, దానికి గుర్తింపు తన పాలనారీతుల వల్లే వచ్చిందని ఆయన ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఎన్నో సార్లు చెప్పారు. ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం తీసుకొచ్చిన ఘనత తనదే అని చంద్రబాబు చెప్పని రోజు లేదు. ఇలాంటి అతిశయోక్తి మాటలు చంద్రబాబు నోట వినలేక జనాలు చచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో బాబుకు సోషల్ మీడియా ఓ రేంజ్‌లో చాకిరేవు పెడుతున్నారు.
చంద్రబాబుపై ర్యాగింగ్ పీక్‌కు చేరిందనే చెప్పాలి. చంద్రబాబునాయుడు అనే నాయకుడు భవిష్యత్‌లో ముఖ్యమంత్రి పదవి చేపట్టి, హైదరాబాద్‌ను నిర్మించి ప్రపంచ పటంలో పెడతాడని తెలియక, అంతకంటే ముప్ఫైనలబై ఏళ్ల క్రితమే కాంగ్రెస్ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి BHEL, HAL, HMT, BEML, MIDANI, BEL, DRDL, DRDO, ECIL, IDPL, IICT, Bharath dynamics తదితర 50కి పైగా ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి విద్యాసంస్థలని హైదరాబాద్ తీసుకొచ్చారంటూ బాబును దెప్పి పొడిచారు.
ఇవన్నీ హైదరాబాద్‌కు వచ్చే సమయానికి చంద్రబాబునాయుడు చంద్రగిరిలో లేదా రంగంపేటలో పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకుంటున్న తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంటారామో. హైదరాబాద్‌కు ఎన్నో పరిశ్రమలు, విద్యాసంస్థలను తీసుకొచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డి, ఆ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టడం మరిచిపోయాడంటూ బాబును నెటిజన్లు ఆడుకున్నారు.
అయినా కాసు బ్రహ్మానందరెడ్డిది ఏముందులే, హైదరాబాద్‌కు శిలాఫలకం వేసి, ఎన్నెన్నో చేసిన నిజాం రాజులకు హైదరాబాద్‌ని ప్రపంచ పటంలో పెట్టడం చేతకాలేదంటూ నెటిజన్లు సెటైర్స్ విసిరారు. బాబుపై నెటిజన్ల సృజనాత్మక సెటైర్స్ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ గురించి బాబు చెబుతున్నవన్నీ ప్రగల్భాలే తప్ప, ఆయన వల్లే అంతా జరిగిపోయిందనడంలో వాస్తవం లేదని లోకానికి చాటి చెప్పడంలో నెటిజన్లు వ్యంగ్యాన్ని ఆశ్రయించడాన్ని గమనించొచ్చు.