విశాఖలోని బర్మాకాలనీలో ఒక ఇంటి మీద దాడి చేసి కొట్టారని తమకు ఓటేయలేదని ఇలా చేశారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దానిని పట్టుకుని విపక్ష పార్టీలకు చెందిన పెద్దల నుంచి చాలా మంది ఇదంతా వైసీపీ మూకల పని అరాచకం అని దారుణంగా విమర్శించారు.
అయితే ఈ దాడి కేసులో అసలు విషయాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ ఇంటి వారు మద్యం సేవిస్తూ చుట్టు పక్కల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే వారి మీద స్థానికంగానే దాడి జరిగిందని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెళ్ళడైంది. దానికి రాజకీయ రంగు పులిమి అధికార పార్టీ నేతలే ఇలా దాడులు చేయించారు అని తప్పుడు కధనాలు అల్లారని కూడా పోలీసులు భావిస్తున్నారు.
రెండు ప్రధాన మీడియా సంస్థల మీద దీనిని సంబంధించిన కేసులను పోలీసులు నమోదు చేయడం విశేషం. తమకు ఓటేయలేదని దాడులు చేయించారని ఈ విధంగా చెప్పించి కేసుని రాజకీయ మలుపు తిప్పారు. అలా రెండు ప్రధాన మీడియా సంస్థలు ప్రచారం చేశాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.
దాంతో సదరు మీడియా సంస్థలు చానళ్ళ మీద కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఇలా ప్రతిపక్షాలకు కొమ్ము కాసే మీడియా సంస్థల మీద కేసులు నమోదు కావడం చర్చనీయాంశం అయింది. అసలు ఏ దాడి జరిగినా వ్యక్తిగత కక్షలతో గొడవలు జరిగినా వైసీపీ మీదనే దానిని ఎగదోస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల మీద అధికార పక్షం అయితే మండిపడుతోంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి అసలు వాస్తవాలు పూర్తిగా బయటపెట్టాలని కోరుతున్నారు.