ప్రధాన మంత్రి ఛాన్స్ ను వదిలేసుకున్నారట!

ప్రతి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటుంది. ప్రతి ఎంపీకి ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉంటుంది. అలాంటి గోల్డెన్ ఛాన్స్ అందరికీ రాదు. ఒక ఎమ్మెల్యే సీఎం కావాలనుకుంటే, ఒక ఎంపీ పీఎం కావాలనుకుంటే…

ప్రతి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటుంది. ప్రతి ఎంపీకి ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉంటుంది. అలాంటి గోల్డెన్ ఛాన్స్ అందరికీ రాదు. ఒక ఎమ్మెల్యే సీఎం కావాలనుకుంటే, ఒక ఎంపీ పీఎం కావాలనుకుంటే కుదరదు. అందుకు రాజకీయ పరిస్థితులు కలిసిరావాలి.

అంతే కాకుండా ఆ పదవులను నిర్వహించే సామర్థ్యం కూడా ఉండాలి. ఏది ఏమైనా అదంత ఈజీ వ్యవహారం కాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి మీద ఆశ పెట్టుకున్న సీనియర్లు చాలామంది ఉన్నారు. వాస్తవానికి పార్టీలో రేవంత్ రెడ్డి జూనియర్ కాబట్టి ఆయన సీఎం కావడం ఇప్పటికీ చాలామందికి ఇష్టం లేదు.

పదవులు వచ్చాయనుకోండి అవి ఎంత కాలం ఉంటాయో తెలియదు. కొందరికి ఒక్కసారి అవకాశం రావడమే గగనమైతే, కొందరికి రెండుమూడుసార్లు ఛాన్స్ వస్తుంది. ఉదాహరణకు నరేంద్ర మోడీ. కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి గాయిగత్తర లేపి ప్రధాని అయిపోవాలని తెగ ఉబలాటపడిపోయాడు. కానీ కాలం కలిసి రాలేదు.

గులాబీ పార్టీ నాయకులు కూడా తమ అధినేత ప్రధాని అయిపోతాడని సంతోషపడి సంబరాలు చేసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని అన్నాడు. కానీ తాను ఆ పదవి తీసుకోలేదని, తనకు రాష్ట్రం ముఖ్యమని అన్నాడు.

కొంతకాలం క్రితం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు అలియాస్ వీహెచ్ తనకు రెండుసార్లు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, కానీ వదులుకున్నానని అన్నాడు. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా తనకు ప్రధాని అయ్యే అవకాశం వస్తే వదులుకున్నానని చెప్పాడు.

తనకు చాలాసార్లు పీఎం ఆఫర్లు వచ్చాయన్నాడు. ఆ పోస్టు తీసుకుంటానంటే తాను సపోర్ట్ చేస్తానని ఓ అపోజిషన్ లీడర్ చెప్పాడట. పార్లమెంటు ఎన్నికలకు ముందు తరువాత చాలాసార్లు ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేశానని, తాను తన ఐడియాలజీ వదులుకోలేక పదవిని వద్దనుకున్నానని చెప్పాడు.

పీఎం పదవి కంటే తనకు ఐడియాలజీ ప్రధానమన్నాడు. ఈ విషయం ఇదివరకు కూడా ఓసారి చెప్పాడు. అయితే గడ్కరీ విలువలు గల నాయకుడని బీజేపీలో పేరుంది.

11 Replies to “ప్రధాన మంత్రి ఛాన్స్ ను వదిలేసుకున్నారట!”

  1. అయ్యే అవకాశం అంటే అక్కడ పూర్తి మెజారిటీ ఉన్న వాళ్ళు “ఆ ఇటు రావాలయ్యా” అంటూ పిలిచారా? మన్మోహన్ సింగ్ ని తీసి ఈయన ని పెట్టాలి అనుకున్నారా? 2014 తర్వాత ఈ ఆఫర్ అయి ఉంటే ఈయన తో పాటు బీజేపీ నుంచి ఎంతమంది వెళ్తారు? వెళ్తే చెల్లుతుందా!

  2. ఇలాంటివి మాట్లాడితే బీజేపీ లో ఉన్న కొద్దో గొప్ప గౌరవం కూడా పోతుంది.

  3. ఆస్థానఅపానవాయువుగాడిలాగా ఈ కొత్త అపానవాయువుగాడు కూడా కామెంట్ డిలిట్ చేసేసాడు

  4. ఆస్థానఅపానవాయువుగాడిలాగా ఈ కొత్త అపానవాయువుగాడు కూడా కామెంట్ తీసేసాడు

Comments are closed.