ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది దేవర సినిమా. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాక్ సంగతి పక్కనపెడితే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 అవాంఛనీయ ఘటనలు జరిగాయి.
వీటిలో ముఖ్యమైనది ఎన్టీఆర్ కటౌట్ కాలిపోవడం. అది కూడా కీలకమైన థియేటర్ లో కావడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఫేమస్ సుదర్శన్ థియేటర్ వద్ద దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ ది భారీ కటౌట్ ఏర్పాటుచేశారు.
అర్థరాత్రి నుంచి కటౌట్ వద్ద భారీ హంగామా నడిచింది. అభిషేకాలు, హారతి పట్టడాలు, కొబ్బరికాయలు కొట్టడం అన్నీ పద్ధతి ప్రకారం జరిగాయి. అయితే ఊహించని విధంగా సినిమా షో పూర్తయిన వెంటనే, ఎన్టీఆర్ కటౌట్ కాలిపోయింది.
దీంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. సినిమా బాగా లేకపోవడం వల్ల తారక్ ఫ్యాన్స్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కొందరు వాదించగా.. ఎన్టీఆర్ యాంటీ-ప్యాన్స్ ఈ పని చేశారని మరికొందరన్నారు. ఓవైపు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకురాగా.. దాదాపు అదే టైమ్ లో వివాదం కూడా అదుపులోకి వచ్చింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. షో పూర్తయిన తర్వాత కటౌట్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు ఆనందంగా బాణసంచా కాల్చారు. వాటిలో కొన్ని ఎగిరి, కటౌట్ కు వేసిన దండల్లో పడ్డాయి. అవి కాస్తా మంటలుగా మారి, మొత్తంగా కటౌట్ ను కాల్చేశాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ అవాంఛనీయ ఘటన జరిగింది. కడప జిల్లా జమనాపల్లిలో దేవర సినిమా చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మరణించాడు. అతడ్ని మస్తాన్ వలిగా గుర్తించారు. సినిమా చూస్తూ గుండెపోటుతో అతడు చనిపోయినట్టు భావిస్తున్నారు.
ఇటు దేవర రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పట్లానే ఫ్యాన్ వార్ మొదలైంది. సాధారణంగా ప్రతి రిలీజ్ కు ఎన్టీఆర్-మహేష్ అభిమానులు కొట్టుకుంటారు. ఈసారి వీళ్లతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు.
ఈసారి మెగా ఫాన్స్ vs. ఎన్టీఆర్. రీజన్ ఆచార్య ఫ్లాప్
ఈ సారి మెగా ఫాన్స్ vs ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆచార్య ఫ్లాప్ వల్ల
యన్టీఆర్: ‘ఆచార్య’ పుత్ర ఆలస్యం అయ్యిందా???
ఆచార్య పుత్ర: అవును ఆరు నెలలు పట్టింది.
అదే రిపీట్
అదే రాజమౌళి.
అదే శాపం.
అదే కొరటాల.
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
గుండె పోటు వచ్చేలా ఏమి ఉందిరా బై సినిమాలో? అనిరుద్ మ్యూజిక్ అంతలా అదర గొట్టేసాడా? జూనియర్ ఇతనికి ఏదైనా సహాయం చెయ్యాలి.
అందుకే డైరెక్టుగా ఓటిటిలో రిలీజ్ చేస్తే ఈ మంటలు ఉండవు
Acharya movie lo scenes locations chaalaa repeat ayyayi