జ‌గ‌న్‌ను డిక్ల‌రేష‌న్ అడిగే హ‌క్కు టీటీడీకి లేదు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని డిక్ల‌రేష‌న్ అడిగే హ‌క్కు టీటీడీకి లేద‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తేల్చి చెప్పారు. తిరుప‌తిలో శుక్ర‌వారం ఎంపీ డాక్ట‌ర్ ఎం.గురుమూర్తి, మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీషతో క‌లిసి…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని డిక్ల‌రేష‌న్ అడిగే హ‌క్కు టీటీడీకి లేద‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తేల్చి చెప్పారు. తిరుప‌తిలో శుక్ర‌వారం ఎంపీ డాక్ట‌ర్ ఎం.గురుమూర్తి, మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీషతో క‌లిసి ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. పేద‌ల ప‌క్షం వ‌హించ‌డ‌మే పెద్ద అప‌రాధ‌మైంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ త‌మ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దేవ‌దేవుని ద‌ర్శించ‌డానికి వ‌స్తుంటే, అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం లోక విధిత‌మ‌న్నారు.

జ‌గ‌న్ కొండ‌కు వ‌స్తున్నారంటే, చంద్ర‌బాబు ప్ర‌భుభ‌క్తి ప‌రాయ‌ణులైన పోలీస్‌శాఖ వారు 30 యాక్ట్ అమ‌లు పేరుతో ఎక్క‌డిక‌క్క‌డ త‌మ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాయ‌ల‌సీమ వ్యాప్తంగా త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ఇత‌ర నాయ‌కుల్ని గృహ నిర్బంధం చేశార‌న్నారు. దీన్నిబ‌ట్టి జ‌గ‌న్‌ను చూస్తే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ఎంత భ‌య‌మో అర్థ‌మ‌వుతోంద‌ని భూమ‌న మండిప‌డ్డారు.

తిరుమ‌ల శ్రీ‌వారిని ఎలాంటి ఆర్భాటం లేకుండా ద‌ర్శించుకుని వెళ్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న కూడా చేశార‌ని భూమ‌న చెప్పుకొచ్చారు. ప‌ది వేల మందిని స‌మీక‌రిస్తున్న‌ట్టు పోలీసులు త‌మ‌తో చెప్పార‌న్నారు. ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌లంటే చంద్ర‌బాబు సర్కార్‌కు భ‌యం కాబ‌ట్టి, వాటిని నిషేధించుకోవాల‌ని భూమ‌న సూచించారు. శ్రీ‌వారిపై అన‌న్య భ‌క్తివిశ్వాసాలు క‌లిగిన మాజీ ముఖ్య‌మంత్రి వ‌స్తుంటే, భ‌య‌ప‌డుతున్న ప్ర‌భుత్వం చేస్తున్న నిర్వాకంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

హైంద‌వ సంఘాన్ని హింస పెడుతున్న క‌లుషాత్ములు, క‌ళంకితులు ఇవాళ జ‌గ‌న్‌పై అత్యంత దారుణంగా, హేయంగా , నీచాతి నీచంగా దాడికి దిగుతున్నార‌ని భూమ‌న దుయ్య‌బ‌ట్టారు. జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇచ్చి దైవ ద‌ర్శ‌నానికి వెళ్లాల‌ని భ‌గ‌వంతుని ప‌ట్ల అంతంత మాత్రంగానే న‌మ్మ‌కం ఉన్న సూడో వ్య‌క్తులు జ‌గ‌న్‌ను క‌ట్ట‌డి చేయాల‌ని మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

భ‌గ‌వంతునిపై భ‌క్తితో ఎవ‌రొచ్చినా సాద‌ర స్వాగ‌తం ప‌లకాల‌ని హిందుత్వం, స‌నాత‌న ధ‌ర్మం చెబుతాయ‌ని ఆయ‌న అన్నారు. ఆ ధ‌ర్మానికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా, సీఎంగా ఐదుసార్లు స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన వ్య‌క్తిని, అంత‌కు ముందు ఎన్నోసార్లు ఎలాంటి ఆటంకం లేకుండా దైవ ద‌ర్శ‌నం చేసుకున్న ఒక పార్టీ నాయ‌కుడిని డిక్ల‌రేష‌న్ అడుగుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు తాము చేసిన ఒక క‌ళంకిత ప‌నికి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయి, దాని నుంచి ఎలా భ‌య‌ట‌ప‌డాలో అర్థంకాని ప‌రిస్థితుల్లో అధికార పార్టీ నాయ‌కులున్నార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. త‌మ పార్టీ పిలుపు మేర‌కు శ‌నివారం రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని అనుకుంటుంటే, వాళ్ల‌ను క‌ట్ట‌డం చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పూజ‌లు చేయ‌డానికి కూడా అర్హ‌త లేదా? అని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌ణికిపోతోంద‌న్నారు. దారుణ‌మైన ప‌రిస్థితి రాష్ట్రంలో నెల‌కుంద‌న్నారు. జ‌గ‌న్‌కు ఎవ‌రూ స్వాగ‌తం ప‌ల‌క‌కూడ‌ద‌ని, ఆయ‌న వెంట ఎవ‌రూ రాకూడ‌ద‌ని, ఆయ‌న వెంట ఎవ‌రూ లేర‌ని చెప్ప‌డానికే ఈ కుట్ర త‌ప్ప‌, మ‌రొక‌టి కాద‌ని భూమ‌న అన్నారు. త‌మ కార్య‌క‌ర్త‌ల్ని, నాయ‌కుల్ని భ‌య‌పెట్టాల‌ని చూస్తే, భ‌య‌ప‌డేవాళ్లెవ‌రూ లేర‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అల‌జ‌డి మా జీవితం, ఆందోళ‌న మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం, నీ పాశ‌విక విధానాల్ని నిరంత‌రం వ్య‌తిరేకిస్తూనే వుంటామ‌ని భూమ‌న హెచ్చ‌రించారు. మీరెంత‌గా నిర్బంధానికి గురి చేస్తే, అంతగా పైకి లేస్తామ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జా గొంతుక‌ను వినిపించి, నీ పాపపు పాల‌న మీద ప్ర‌జాందోళ‌న చేస్తామ‌ని భూమ‌న హెచ్చ‌రించారు. అబ‌ద్ధాన్ని నిజం చేయ‌డానికి మీరు (చంద్ర‌బాబు అండ్ కో) ఎంత‌కైనా సిద్ధ‌ప‌డ‌తార‌న్నారు. వేద‌మూర్తి ప్ర‌సాదం మీద వేయి నాలుక‌ల‌తో మాట్లాడొద్ద‌ని చంద్ర‌బాబుకు భూమ‌న హిత‌వు చెప్పారు.

వ్య‌క్తిగత రాజ‌కీయాల్లోకి శ‌క్తిమూర్తిని తీసుకురావ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. చంద్ర‌బాబు ఒక మాట‌, కూట‌మి స‌భ్యుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రొక మాట మాట్లాడుతున్నార‌ని భూమ‌న విమ‌ర్శించారు. హైంద‌వ ధ‌ర్మానికి తానొక్క‌డే ప్ర‌తీక అన్న‌ట్టుగా ప‌వ‌న్ మాట్లాడార‌ని భూమ‌న అన్నారు. ఆ త‌ర్వాత ఇదే ప‌వ‌న్ ద‌ర్శ‌నానికి వెళుతున్న జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ విష‌య‌మై టీటీడీ అధికారులు చూసుకుంటార‌ని స‌న్నాయి నొక్కులు నొక్కార‌న్నారు. సీఎం బాబు శిష్యులు మాత్రం జ‌గ‌న్‌ను రానివ్వ‌మ‌ని భీక‌ర ప్ర‌తిజ్ఞ‌లు చేస్తున్నార‌న్నారు.

కూట‌మిలోని మ‌రో పార్టీ బీజేపీ నాయ‌కులు మాత్రం అలిపిరిలో జ‌గ‌న్‌ను అడ్డుకుంటామ‌ని చెప్పార‌న్నారు. తామే హిందువుల‌ని, మ‌రెవ‌రూ కాద‌ని, జ‌గ‌న్‌ను కొండ‌పైకి రానివ్వ‌మ‌ని భీష్మ ప్ర‌తిజ్ఞ‌లు చేస్తున్నార‌న్నారు. తిరుప‌తి బీజేపీ నాయ‌కులు ఎవ‌రి పేరు చెబితే వారు మాత్ర‌మే హిందువుల‌ట అని వెట‌క‌రించారు. వీళ్లంతా హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించే వాళ్లు అని ఆయ‌న దెప్పి పొడిచారు.

37 Replies to “జ‌గ‌న్‌ను డిక్ల‌రేష‌న్ అడిగే హ‌క్కు టీటీడీకి లేదు”

  1. అంతే…అంతేలే GA…. మీకు నచ్చినట్టు చెయ్యండి…ఎవరి మనోభావాలు ఇప్పుడు దెబ్బ తినవు లెండి….అసలు హిందూ ధర్మాన్ని గౌరవించాల్సిన అవసరం మన దేశంలో లేదు లెండి….🙏🙏

  2. TTD కి ఎవరు అయినా ఒక్కటె. జగన్ నీకు ఎక్కువ కావచ్చు, TTD కి కాదు.

    .

    ఇన్నాళ్ళూ అదికారిక హొదా అడ్డుపెట్టుకొని డిక్లరషన్ ఇవ్వలెదు! ఇప్పుడు తప్పదు!!!

  3. Giriraj Kishore, senior vice-president of the Vishwa Hindu Parishad, today criticised Congress president Sonia Gandhi for refusing to sign the visitors’ register at the Tirumala Devasthanam at Tirupati during her visit to the Balaji temple there.

    Kishore also questioned the wisdom of the temple priests and authorities allowing Gandhi to enter the temple in violation of its age-old tradition.

    “It is a fact that Mrs Gandhi is a Roman Catholic and that her daughter is married to a Christian. No one knows whether they have adopted Hinduism,” he said.

    All non-Hindus visiting the Tirupati temple have to sign the visitors’ register. This condition was complied with by former Union minister C K Jaffer Sharief when he had darshan of Lord Balaji recently, Kishore said.

    But Gandhi and her daughter Priyanka refused to sign the register despite the priests’ insistence, he said.

    He alleged that her visit to the Balaji temple was aimed at making a fool of Hindus.

  4. డిక్లరేషన్ అడిగే హక్కు అధికారం ఎవరిదో చెప్పండి అబ్దుల్ కలాం గారి కంటే జగన్ గొప్పవాడ

  5. వీళ్ళకి పైత్యం బాగా ముదిరింది. నిబంధనలు ను గౌరవించాలనే స్పృహ కూడా లేనంతగా వీళ్ళ అహంకారం పెరిగింది.

  6. “జ‌గ‌న్‌ను డిక్ల‌రేష‌న్ అడిగే హ‌క్కు టీటీడీకి లేదు”

    is he helping or hurting Jagan…lol

    unbelievable how this che ddi fellows turned into…Reddys must reclaim honor, diginity by leaving this fellow

  7. These leaders use Hindutwa for their political gains. Nothing else. Who knows the exact meaning and principles of Hindutwa. How many people know that YSR started his padayatra after visiting chilukuri balaji temple. He performed Sudarshan homa in 2004 with the TTD priests. Who knows here that YSR passed GO for payment of Rs.5000/- for each temple and pujari for daily “deepa, dhupa, naivedyam” and also for the livelihood of poor priests.

    As per Hindu religion… marriage is a sacred union and Devine bond. “Naathicharaami” is a great word in Hindu marriage which means the husband promises his wife “I will not leave your hand under any difficult situations, joys and sorrows” How many the socalled leaders following it. They talk whatever comes to their minds and do whichever is convenient to them.

    Since Jagan is a Christian, these people now take up Hindutwa and try to get get political gains.

    Being a Hindu..this is my observation.

  8. హిందూ మతం మీద నమ్మకం స్వామి మీద భక్తి వున్నా వారికీ మాత్రమే ఈ దేవాలయం అంతేకాని నమ్మకం ఉందని సంతకం చేయనన్న వానికి ఎందుకు హిందువులు ఆలయాలు ఇదేమి exhibition కాదు అందరు వెళ్లి చూసిరావటానికి గుళ్ళోకి చెప్పులు వేసుకొని రానివ్వరు సెల్ల్ఫోన్ తో రానివ్వరు ఆ రూల్స్ అంగీకరించని వాడిని రానివ్వరు ఇది అంతే

  9. సర్ మీరు 2029 ఎలేచ్షన్స్ లో అధికారం లోనికి వస్తే లడ్డు గతం లో కాంట్రాక్టర్స్ కి ఇస్తామని జగన్ గారు సంతకం చెయ్యకుండా వెళతామని చెప్పండి మీ అభిప్రాయం జనాలకు నచ్చితే మీకు ఓట్లేస్తారు

Comments are closed.