విశాఖ వస్తేనే జగన్ కి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆయన లో హుషార్ కూడా కనిపిస్తుంది. అయితే జగన్ చంద్రబాబులా మాటలు ఎక్కువగా చెప్పరు. చేతలలో చూపిస్తారు. ఈసారి విశాఖను ప్రపచ చర్చకు పెట్టారు.
గిన్నీస్ రికార్డు దిశగా విశాఖ లో మెగా క్లీన్ బీచ్ కార్యక్రమం జరిగింది. ఏకంగా 29 కిలోమీటర్ల మేర పాతిక వేల మంది వాలంటీర్లతో సాగిన ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు.ఏకంగా 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించి తిరుగులేని రికార్డు ని సృష్టించారు. అలా విశాఖ వరల్డ్ వైడ్ గా ఫోకస్ అయింది.
మరో వైపు ప్లాస్టిక్ ని నిషేధించే కార్యక్రమాన్ని విశాఖ నుంచే మొదలుపెట్టి ఏపీ వ్యాప్తం చేస్తున్నారు. పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్‌ను కూడా విశాఖలో ఏర్పాటు చేయడం మరో విశేషం. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఇనిస్టిట్యూట్ ఇక్కడ నుంచే దేశంతో పాటు ప్రపంచానికి ప్లాస్టిక్ నిర్మూలనకు సూచనలు ఇస్తుంది. వ్యర్ధాలను తొలగించే కార్యక్రమం కూడా చేపడుతుంది.
ఇలాంటి ఇనిస్టిట్యూట్‌ను విశాఖ వేదికగా ఏర్పాటు చేయడం అంటే నిజంగా విశ్వ యవనిక మీద విశాఖను నిలబెట్టినట్లే అంటున్నారు. ఇక విశాఖలో జగన్ కొత్తగా కనిపించారు. ప్లాస్టిక్ రీసైకిలింగ్ నుంచి తయారు చేసిన నల్ల కళ్ళద్దాలను ఆయన పెట్టుకుని ఫ్యాన్స్ కి హుషార్ తెచ్చారు.
అలాగే జగన్ ఎపుడూ పెద్దగా జోక్స్ వేయరు. కానీ తాను వస్తున్నపుడు దారిపొడవునా ఫ్లెక్సీలను చూసానని అవి తనవే అనుకోండి, వాటిని చూసి ఆనందం వేసినా ప్లాస్టిక్ తో కట్టారెమో అని భయమేసింది అంటూ చలోక్తి విసిరారు. అయితే గుడ్డతో కట్టారని తెలిసి హ్యాపీ ఫీల్ అయ్యాయని జగన్ చెప్పుకొచ్చారు. ఇకపైన ఏపీలో ఫ్లెక్సీస్ ఎవరు కట్టినా గుడ్డతోనే కట్టాలని ఆయన ఆదేశించడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు.